NTV Telugu Site icon

Canada Govt: భారత్‌ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలను నిలిపేసిన కెనడా

Canada

Canada

Canada Govt: భారత్‌ వెళ్లే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో అదనపు తనిఖీలు చేపట్టడాన్ని కెనడా ప్రభుత్వం విరమించుకుంది. కెనడా నుంచి భారత్ వెళ్లే వారికి ఈ అదనపు తనిఖీలు నిర్వహిస్తామని ఇటీవల ఆ దేశ మంత్రి తెలిపారు. అందుకోసం మిగతా ప్యాసింజర్లలా కాకుండా భారత్‌ వెళ్లే వారంతా కొన్ని గంటలు ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచనలు జారీ చేసింది. తాజాగా ఈ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు కెనడియన్ ప్రభుత్వం పేర్కొనింది.

Read Also: Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..

ఇక, భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా నవంబర్ 1 నుంచి 19వ తేదీ మధ్యలో ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణం చేయొద్దని ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌ పత్వంత్‌ సింగ్‌ పన్నూన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కెనడా మంత్రి అనితా ఆనంద్‌ మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్‌కు ప్రయాణించే వారికి అదనపు భద్రతా తనిఖీలను పెంచామని వెల్లడించారు. ఈ చర్యలు అమల్లో ఉన్నప్పుడు కొన్ని ఆలస్యాలు జరిగాయని మంత్రి చెప్పుకొచ్చారు. కానీ, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కెనడా సర్కార్ వెనక్కి తీసుకుంది.