Mallikarjun Kharge: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చెబుతున్న సంపద పునర్విభజన చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలకు ఉన్నవారికి ఇస్తుందా..? అని ప్రశ్నించారు. అయితే, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని, సమాజాన్ని విభజించే ప్రయత్నాలను ప్రధాని ఆపాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ రోజు అన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరోపణలు ముస్లింలీగ్ ఆలోచనల్ని గుర్తుకు తెస్తున్నాయంటూ ఇటీవల జరిగి ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని అన్నారు. ఆదివారం నాడు రాజస్థాన్‌లో జరిగి ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రజల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని ముస్లింలకు పంచాలని కాంగ్రెస్ పనిచేస్తుందని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ‘‘వారు మన సోదరీమణులు, తల్లుల మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టారు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
Read Also: Hemant Soren: ఎన్నికల ప్రచారానికి హేమంత్ అభ్యర్థన.. ఈడీకి కోర్టు కీలక ఆదేశాలు
అయితే, ఈ వ్యాఖ్యలపై వయనాడ్‌లో జరిగిన సభలో ఖర్గే స్పందిస్తూ..‘‘ కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని ప్రధాని చెప్పారు. ఆయన నాకు సమయం ఇస్తే మా మేనిఫెస్టో్ను తీసుకెళ్లి వివరిస్తాను. మేనిఫెస్టోల ముస్లింకు మాత్రమే అని ఎక్కడ ఉంది..? మా మేనిఫెస్టో్ పేదులు, యువత, రైతులు ప్రతీ ఒక్కరి కోసం. అతను సమాజాన్ని విభజించేలా , హిందూ-ముస్లిం గురించి మాట్లాడుతున్నారు.’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. యువన్యాయం, నారీ శక్తి అందరిదీ, ఇది ముస్లింలకు మాత్రమే కాదని, షెడ్యూల్ తెగలు, కులాలకు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి అని, యూపీఏ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ విమర్శించిందని అన్నారు.
ఉపాధిహామీతో కాంగ్రెస్ దేశాన్ని పేదరికం వైపు తీసుకెళ్తుందని బీజేపీ ఆర్పించిందని, ప్రధాని మోడీ, హోంమంత్రి వీటిని తీసేయలేదని ఆయన అన్నారు. ప్రపంచంలో పర్యటిస్తున్నప్పటికీ, దేశంలోని మణిపూర్‌ని ఎందుకు సందర్శించలేదని ఖర్గే ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి, ప్రజల్ని ఓదార్చారని చెప్పారు. ప్రధాని మతతత్వ వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు.