NTV Telugu Site icon

Asaduddin Owaisi: లోక్‌సభలో ఓవైసీ ‘పాలస్తీనా’ నినాదం.. అనర్హత వేటు వేయొచ్చా.?

Owaisi

Owaisi

Asaduddin Owaisi: లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ చేసిన నినాదాలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ ఆయన నినాదాలు చేశారు. అయితే, దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఎంపీగా ఓవైసీపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి ఫిర్యాలు అందాయి. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అతడిపై అనర్హత వేటు వేయాలని కోరారు. పరాయి దేశానికి విధేయత చూపించినందుకు ఓవైసీని అనర్హుడి ప్రకటించవచ్చని సూచించారు.

Read Also: Canada: ట్రూడోకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక స్థానంలో పార్టీ ఓటమి..

ఎంపీ వేరే దేశానికి కట్టుబడి ఉన్నందున లోక్‌సభ సభ్యుడిగా అనర్హుడిగా బీజేపీ పేర్కొంది. మంగళవారం అసదుద్దీన్ ఓవైసీ 18వ లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేస్తూ ఈ నినానాలు చేశారు. ఉర్దూలో ప్రమాణస్వీకారం చేసిన ఆయన జై పాలస్తీనా అంటూ నినదించారు. దీంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. అయితే, ఓవైసీ తన చర్యను సమర్థించుకున్నారు. ఇలా అనడంతో తప్పులేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇలా నినాదాలు చేయొద్దనే నిబంధలను లేవని చెప్పారు. పాలస్తీనా గురించి మహాత్మా గాంధీ ఏం చెప్పారో చదవండి అంటూ సూచించారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ పాలస్తీనా ప్రస్తావనపై కొంతమంది సభ్యుల నుండి ఫిర్యాదులు అందాయని, వ్యాఖ్యలకు సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయో చూస్తానని అన్నారు. ‘‘పాలస్తీనాతో లేదా మరే ఇతర దేశంతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఒకే విషయం ఏమిటంటే, ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, ఏ సభ్యుడు మరొక దేశాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేయడం సరైనదేనా? మేము నిబంధనలను తనిఖీ చేయాలి. కొంతమంది సభ్యులు వచ్చి, ప్రమాణం ముగింపులో పాలస్తీనా నినాదం గురించి నాకు ఫిర్యాదు చేశారు’’ అని అన్నారు.