Site icon NTV Telugu

DA Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్‌ కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర కేబినెట్‌… ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశాలో… ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది.. మంత్రివర్గ ఆమోదంతో 31 శాతంగా ఉన్న డీఏ 34 శాతానికి పెరగనుంది.. పెరుగుతున్న ఇంధన ధరలు మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఉపశమనం కలిగిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా డీఏ పెంపు నిలిచిపోయింది.. ఉద్యోగుల జీతాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లిస్తారు… ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇద్దరికీ వర్తిస్తుంది. ఇక, 01.01.2022 నుండి చెల్లించాల్సిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మరియు పెన్షనర్లకు డీఆర్‌ యొక్క అదనపు వాయిదాను విడుదల చేయడానికి కూడా కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గతంలో ఇచ్చే కరువు భత్యం 31 శాతం కాగా, డీఏను 3 శాతం పెంచి 34 శాతానికి పెంచారు. ఈ నిర్ణయంతో దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. గత ఏడాది అక్టోబర్‌లో చివరిసారిగా డీఏ పెంపును 28 శాతం నుంచి 31 శాతానికి పెంచారు. ప్రభుత్వం ఉద్యోగులకు 18వేలు డియర్‌నెస్ అలవెన్స్‌గా చెల్లిస్తుండగా, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన డీఏ పెంపు ప్రకారం ఆ మొత్తాన్ని 24,000కు పెంచనున్నారు. మొత్తంగా ఉగాది ముందు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.

Exit mobile version