అమెరికా విధానాలకు వ్యతిరేకంగా లావాదేవీలు నిర్వహించే దేశాలపై విధించే కాట్సా(సీఏఏటీఎస్ఏ) చట్టం నుంచి భారత్ కు మినహాయింపు లభించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ చట్టం నుంచి భారత్ ను మినహాయిస్తూ యూఎస్ ప్రతినిధుల సభ తీర్మాణాన్ని గురువారం ఆమోదించింది. ధీంతో రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని.. ఇది చైనా దురాక్రమనను అరికట్టడంతో ఉపయోగపడుతుందని అమెరికా చట్ట సభ ప్రతినిధులు భావిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ) సవరణల ప్రకారం.. భారతీయ-అమెరికన్, హైజ్ ఆర్మ్డ్ సర్వీసెస్ యాక్ట్ లో సభ్యుడైన డెమొక్రాటిక్ ప్రతినిధి రో ఖన్నా తీర్మాణాన్ని సభ ఆమోదించింది. అయితే ఈ సవరణలు పూర్తిగా చట్టంగా మారాలంటే మాత్రం వివిధ దశల్ని దాటుకొని వెళ్లాలి.
చైనా నుంచి పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్ కు అమెరికా అండగా నిలబడాలని భావిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలు నెరవేరాలంటే భారత్- అమెరికా బంధం కీలకమని అక్కడి ప్రతినిధులు భావిస్తున్నారు. కాట్సా నుంచి పూర్తిస్థాయిలో మినహాయింపు లభిస్తే అమెరికా శత్రు దేశాలైన రష్యా, ఇరాన్ దేశాలతో భారత్ మరింతగా రక్షణ, వాణిజ్య సంబంధాలను కొనసాగించే అవకాశం లభిస్తుంది. కాట్సా చట్టం ప్రకారం ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా దేశాలతో లావాదేవీలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తోంది.
Read Also: Telangana Rains: బ్రేక్ తీసుకున్న వరుణుడు.. మళ్ళీ 18 తర్వాత జల్లులు
స్వాతంత్య్రం తరువాత నుంచి ఇండియా ఎక్కువగా రష్యా ఆయుధాలు, సైనిక వ్యవస్థలపైనే ఆధారపడుతోంది. రానున్న రోజుల్లో డిఫెన్స్ కు సంబంధించి యుద్ధవిమానాలు, ఇతర రక్షణ వ్యవస్థల ఆధునీకీకరణపై రష్యాపై భారత్ ఆధారపడి ఉంది. దీంతో పొరుగుల చైనా, పాకిస్తాన్ దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వీటన్నింటి మధ్య భారత్ రష్యాతో తన స్నేహాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యుత్తమ క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్ రష్యా నుంచి 5.34 బిలియన్ డాలర్ల వ్యయంతో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అయితే భారత్ ఈ చర్య వల్ల అమెరికా కాట్సా ఆంక్షల్లోకి వస్తుందని గతంలో పలువురు అమెరికా ప్రతినిధులు హెచ్చరించారు. కాగా భారత్ ఇవేవీ పట్టించుకోకుండా రష్యా నుంచి ఎస్ – 400 కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపింది.