CAA: కేంద్రమంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలులోకి వస్తుందని ప్రకటించారు. రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లోనే కాదు, భారత్ అంతటా CAA అమలు చేయబడుతుందని నేను హామీ ఇవ్వగలను అని చెప్పారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్‌లోని కక్‌ద్వీప్ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ఈ హామీని ఇచ్చారు.
వివాదాస్పద పౌరసత్వం సవరణ చట్టం(సీఏఏ)ని అమలు చేయడాన్ని ఎవరూ ఆపలేరని గతేడాది కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముఖ్యంగా బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సీఏఏను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
READ ALSO: Facebook Fraud: ఆన్‌లైన్ మోసానికి స్నేహితులు బలి.. రూ. 1.60 లక్షలు స్వాహా.!
డిసెంబర్ నెలలో కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ.. చొరబాటు, అవినీతి, రాజకీయ హింస, బుజ్జగింపు రాజకీయాలను ఉద్దేశిస్తూ మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ఆమె ప్రభుత్వాన్ని గద్దె దించి 2026లో బీజేపీని గెలిపించుకోవాలని ఆయన కోరారు.
2019లో పార్లమెంట్ రెండు సభల్లో సీఏఏ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తర్వాత భారత్ అంతటా దీనిపై వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, సీఏఏ కోసం కేంద్రం ఇంకా నిబంధనలు రూపొందించకపోవడంతో చట్టం అమలు ఆలస్యమవుతోంది.