NTV Telugu Site icon

Kamal Haasan: దేశాన్ని విభజించేందుకే సీఏఏని తెచ్చింది.. కమల్ హాసన్ ఫైర్..

Kamal Haasan

Kamal Haasan

Kamal Haasan: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు దేశాన్ని విభజించేందుకు సీఏఏని అమలు చేశారని కమల్ హాసన్ ఆరోపించారు. శ్రీలంక తమిళులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దేశ సామరస్యాన్ని నాశనం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల్ని విభజించి, సామరస్యాన్ని శాననం చేయడానికి ప్రయత్నిస్తోందని, రాబోయే ఎన్నికల్లో గెలవాలనే తపనతో, బీజేపీ హడావుడిగా సీఏఏని తెరపైకి తెచ్చిందని అన్నారు.

Read Also: CAA: ‘‘ఇది మాకు రామరాజ్యం’’..సీఏఏపై పాక్ హిందూ శరణార్థులు..

ఈ చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు నిర్ణయిస్తున్నందున నోటిఫికేషన్ సమయం మరింత సందేహాస్పందంగా ఉందని అన్నారు.ఈ చట్టం అణగారిన మతపరమైన మైనారిటీలను రక్షించడానికి ఉద్దేశించినట్లైతే కష్టాలను ఎదుర్కొంటున్న శ్రీలంక తమిళులను ఎందుకు చేర్చలేదు..? తమిళనాడు రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది, దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించిందని కమల్ అన్నారు. మన ముస్లిం సోదరులకు వారి అత్యంత పవిత్రమైన రోజుల్లో రంజాన్ మొదటి రోజునే ఈ విషాద వార్త అందిందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమంతా పోరాడాలని, మతం, కులం, భాష ఆధారంగా మన పౌరులను విభజించేందుకు ప్రయత్నించే వారికి చెక్ పెట్టాలని కమల్ హాసన్ పిలుపునిచ్చాడు. మరోవైపు ఈ చట్టాన్ని మరో సినీనటుడు విజయ్ కూడా విమర్శించారు. ఈ చట్టాన్ని అమలు చేయవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. సీఏఏని అమలు చేస్తున్నట్లు నిన్న కేంద్రం ప్రకటించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొంటున్న ముస్లి్మేతర హిందూ, పార్సీ, బౌద్ధ, జౌన, క్రిస్టియన్, పార్సీ శరణార్ధులకు, డిసెంబర్ 31, 2014కి ముందు భారతదేశానికి వచ్చిన వారికి ఈ దేశ పౌరసత్వం రానుంది.