NTV Telugu Site icon

MK Stalin: సీఏఏ తర్వాత బీజేపీ టార్గెట్ ఇదే.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..

Mk Stalin

Mk Stalin

MK Stalin: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ బీజేపీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే సీఏఏని తమ రాష్ట్రంలో అమలు చేయమని డీఎంకే చెబుతున్న నేపథ్యంలో.. బీజేపీ సీఏఏతో ఆగడని, దాని తరుపరి లక్ష్యం వివిధ భాషల మాట్లాడే ప్రజలే అని ఆయన ఆరోపించారు. బీజేపీ భవిష్యత్తులో వీటికి సంబంధించిన చట్టాలను తీసుకువస్తుందని ఆయన అన్నారు.

Read Also: Manoj Sharma: ‘‘12th ఫెయిల్’’ రియల్ హీరోకి IGగా ప్రమోషన్..

2004 ఎన్నికలకు ముందు కూడా ‘‘భారత్ ప్రకాశిస్తోంది’’ అంటూ బీజేపీ ప్రచారం చేసిందని, అన్ని సర్వేలు కూడా బీజేపీ అనుకూల వేవ్ ఉందని అంచనా వేశాయని, ఈ సమయంలో ప్రతిపక్షాలు కూడా ఐక్యంగా లేవని అయితే, ఎన్నికల ఫలితాలు యూపీఏకు అనుకూలంగా వచ్చాయని, ప్రభుత్వం తదుపరి 10 ఏళ్లు పాలించిందనిర, 2024లో కూడా 2004 ఫలితాలు ప్రతిబింబిస్తాయని, చరిత్ర పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఏఏ బీజేపీ విభజన రాజకీయాల్లో ఒకటని, ఇది మైనారిటీలకు వ్యతిరేకంగా కనిపిస్తోందని సీఎం అన్నారు. భవిష్యత్తులో ప్రతీ రాస్ట్రంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ కొత్త చట్టాలను తీసుకువస్తుందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లతో డీఎంకే తన ఇమేజ్ కోల్పోతుందా.? అనే ప్రశ్నకు సమాధానంగా.. డీఎంకే మొదటి ఎన్నికలు(1957) నుంచి నిధుల్ని సమీకరిస్తోందని, డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై 1967 ఎన్నికల సమయంలో రూ. 10 లక్షలు టార్గెట్‌గా పెట్టుకున్నారని స్టాలిన్ అన్నారు. డీఎంకే పారదర్శక పద్ధతిలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించిందని ఆయన తెలిపారు.