NTV Telugu Site icon

Byelections 2025: ఢిల్లీతో సహా మరో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్..

Eletions

Eletions

Byelections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. యూపీలోని మిల్కిపూర్‌‌, తమిళనాడులోని ఈరోడ్‌ (ఈస్ట్‌) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇక, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో ఉత్తరప్రదేశ్ లోని మల్కిపురిలో బైపోల్ అనివార్యమైంది. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన మిల్కిపూర్‌ నుంచి గత ఎన్నికల్లో అవదేశ్‌ ప్రసాద్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫైజాబాద్‌ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచాడు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ రోజు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉండగా.. 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ.. అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ కొనసాగుతుంది.

Read Also: Mangalavaaram: ‘మంగళవారం’ మూవీ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

అలాగే, కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలాంగోళవన్ మరణించడంతో తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. డీఎంకే తరఫున వీసీ చంద్ర కుమార్‌ బరిలోకి దిగుతుండగా.. అన్నాడీఎంకే, బీజేపీలు ఆయనకు సవాల్‌ చేస్తున్నాయి. మొత్తం 46 మంది అభ్యర్థులు ఈ బైపోల్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో 2.28 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కుు వినియోగించుకోనున్నారు. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 8వ తేదీన ఈసీ వెల్లడించనుంది.