Site icon NTV Telugu

Rahul Gandhi: ప్రతిపక్ష స్వరాన్ని అనుమతించండి.. రాజ్యాంగాన్ని రక్షిస్తారని మా నమ్మకం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ రోజు జరిగిన స్పీకర్ ఎన్నికల్లో మూజువాణి ఓటులో ఓం బిర్లా గెలుపొందారు. కోటా నుంచి మూడుసార్లు వరసగా ఎన్నికైన ఓం బిర్లా, గత పార్లమెంట్‌లో కూడా స్పీకర్ బాధ్యతలు చేపట్టారు, వరసగా రెండోసారి స్పీకర్ అయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు కలిసి ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తీసుకెళ్లారు.

Read Also: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ..

ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లోక్‌సభ స్పీకర్ ప్రజల గొంతుకకు మధ్యవర్తి అని, గతం కన్నా ఈ సారి ప్రతిపక్ష ఆ స్వరానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన అననారు. ప్రతిపక్షాలు స్పీకర్ పని చేయడంలో సహకరిస్తాయని, సభ పనిచేయాలని కోరుకుంటున్నామని అన్నారు. సభలో ప్రతిపక్షాల స్వరాన్ని అనుమతించాలని అన్నారు. ‘‘మీరు మమ్మల్ని మాట్లాడేందుకు అనుమతిస్తారనే నమ్మకం ఉంది. ససభను ఎంత సమర్ధవంతంగా నడిపిస్తున్నారనేది ప్రశ్న కాదు. భారతదేశం యొక్క వాణిని ఎంతవరకు వినిపించడానికి అనుమతిస్తున్నారన్నది ప్రశ్న. ప్రతిపక్షాల స్వరాన్ని సైలెంట్ చేయడమనేది అప్రజాస్వామిక ఆలోచన. ఈ ఎన్నికల ద్వారా రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రజలు తీర్పు ఇచ్చారు’’ అని అన్నారు. ప్రతిపక్షాలను మాట్లాడటానికి అనుమతించడం ద్వారా, రాజ్యాంగాన్ని రక్షించే మీ కర్తవ్యాన్ని మీరు చేస్తారనే నమ్మకం ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

Exit mobile version