NTV Telugu Site icon

Kanhaiya Kumar: ‘‘ఆమె రీల్స్ చేయడంలో బాగా బిజీ’’.. ఫడ్నవీస్ భార్యపై కన్హయ్య కామెంట్స్

Kanhaiya Kumar

Kanhaiya Kumar

Kanhaiya Kumar: మహరాష్ట్ర ఎన్నికల్లో విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు ‘‘మతాన్ని రక్షించే’’ బాధ్యత ప్రజలపై ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో అమృతా ఫడ్నవీస్ పేరును నేరుగా ప్రస్తావంచకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్ సౌత్‌వెస్ట్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ చేస్తున్నారు. ఇదే సీటు నుంచి కాంగ్రెస్ తరుపున ప్రఫుల్ల గూడాఢే పోటీ చేస్తున్నారు. ఆయన తరుపున కన్హయ్య కుమార్ ప్రచారం చేశారు.

కన్హయ్య కుమార్ దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. శిక్షణ పొందిన క్లాసికల్ సింగర్, బ్యాంకర్ అయిన అమృతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. “ఇది ధర్మయుద్ధం (మతయుద్ధం) అయితే, మతాన్ని రక్షించడం గురించి మీరు ప్రసంగాలు చేసే ఏ నాయకుడిని అయినా ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి స్వంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా అని అడగండి. మతం గురించి మాట్లాడే నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజానీకం మతాన్ని కాపాడుతున్నారు. ఉపముఖ్యమంత్రి భార్య ఇన్‌స్టాగ్రామ్‌ను ఎలా రీల్స్ చేస్తుంది?’’ అని కన్హయ్య కుమార్ అన్నారు.

Read Also: V. Hanumantha Rao: కులగణన చేయాలా వద్దా.. నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాలి..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్‌పర్సన్‌గా ఉన్న హోం మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షాపై కూడా ఆయన విమర్శలు చేశారు. ‘‘ అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడుతున్నాడా..? అతను బీసీసీఐలో ఐపీఎల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. అయితే, డీమ్ 11 టీమ్స్ తయారు చేయాలని మనకు చెబుతున్నారు. మనం క్రికెటర్లు కావాలని కలలు కంటే, చివరకు జూదగాళ్లుగా మిగిలిపోతున్నాము’’ అని అన్నారు.

అయితే, కన్హయ్య కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. ఇది ప్రతీ మరాఠీ మహిళను అవమానించడమే అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. కన్హయ్య ఓ ఉగ్రవాది, పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురు మద్దతుదారుడని అన్నారు. అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జేఎన్‌యూలో ఓ కార్యక్రమం నిర్వహించి 2016లో కన్హయ్య కుమార్ దేశ ద్రోహం కింద అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఫడ్నవీస్ ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యల తర్వాత కన్హయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.