Bulldozer action: రాజస్థాన్ ఉదయ్‌పూర్ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 తరగతి విద్యార్థి, తన సహవిద్యార్థిపై కత్తితో దాడి చేయడం నగరంలో ఉద్రిక్తలకు దారి తీసింది. దాడి చేసిన బాలుడు మైనారిటీ వర్గాని చెందడం, గాయపడిన బాలుడు మెజారిటీ వర్గానికి చెందడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పలు హిందూ సంస్థలు మధుబనిలో ఆందోళన నిర్వహించాయి. ఈ ఘటన తర్వాత మత ఉద్రిక్తల్ని పెంచింది. ఈ ఘటనలో పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పటించడంతో పాటు షాపింగ్ మాల్స్‌పై రాళ్లతో దాడి చేశారు.
Read Also: CM Chandrababu: కాసేపట్లో ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..
ఇదిలా ఉంటే, ఉదయ్‌పూర్‌లో దాడికి పాల్పడిన బాలుడి కుటుంబం అక్రమంగా నిర్మించిన ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. దాడికి పాల్పడిన బాలుడి కుటుంబం ఇళ్లు అటవీ భూముల్లో అక్రమంగా నిర్మించినట్లు తేలింది. జిల్లా యంత్రాంగం నిందితుడి కుటుంబానికి చెందిన వస్తువుల్ని తీసుకున్న తర్వాత కూల్చివేత మొదలుపెట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ కొనసాగేలా చూసేందుకు ఘటనా స్థలంలో భారీ పోలీస్ బందోబస్తుని మోహరించారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పలువురు స్థానికులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
నిందితుడు శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. ఇది మధుబన్ ప్రాంతంలో మత ఉద్రిక్తతలకు కారణమైంది. దాడి చేసిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనధికార నిర్మాణాలపై స్థానిక పరిపాలన అధికారులు దృఢమైన వైఖరితో పాటు పబ్లిక్ ఆర్డర్‌కి భంగం కలిగించే ఘటనపై చర్యల్ని హైలెట్ చేస్తోంది. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య నగరంలో పోలీస్ బందోబస్తుని పెంచారు. 144 సెక్షన్ విధించడమే కాకుండా, ఒక రోజు పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు.
