యూపీ ఎలక్షన్స్ … బీఎస్పీ తొలి జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. శనివారం బీఎస్పీ అధినేత్రి మాయావతి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె 53 మందితో కూడిన తొలి జాబితాలో విడుదల చేశారు. మరో ఐదుగురు అభ్యర్థుల్ని ఈరోజు సాయంత్రాని కల్లా ప్రకటిస్తామని ఆమె చెప్పారు. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అన్ని స్తానాల్లో బీఎస్పీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఎన్నికల ఫలితాల అనంతరమే పొత్తును ఉపసంహరించుకున్న విషయం తెల్సిందే.
Read Also: కోవిడ్ నిబంధనలను సడలించిన పశ్చిమ బెంగాల్
Also Read
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
మరోవైపు ఇప్పటికే యూపీలో ఎస్పీ,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) కూటమి వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం 29 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పశ్చిమ యూపీలోని స్థానాల అభ్యర్థుల లిస్ట్ వెల్లడించింది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 10 మరియు 14 తేదీల్లో మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 29 స్థానాల్లో ఆర్ఎల్డీ 19 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎస్పీ 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.మొత్తం ఏడు విడతల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10 న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!