కోవిడ్‌ నిబంధనలను సడలించిన పశ్చిమ బెంగాల్‌

పశ్చిమ బెంగాల్ కోవిడ్ నిబంధనలను సడలించింది. వివాహాలకు 200 మంది ఒకేసారి గరిష్టంగా 200 మంది అతిథులతో వివాహ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి బెంగాల్‌ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. శనివారం ఈ మేరకు కోవిడ్ -19 సడలింపులకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.బహిరంగ ప్రదేశాల్లో జాతరలు మరియు మేళాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని “ఓమిక్రాన్ వేరియంట్‌పై ఉన్న రిపోర్టులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సడలింపుల పై ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ప్రస్తుతం ఉన్న పరిమితులను కొనసాగిస్తునే.. అవసరమైన విధంగా గ్రేడెడ్ సడలింపులను అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read Also: మద్దతు ధర అడిగితే జైల్లో పెడతారా.. జగన్‌పై చంద్రబాబు ఫైర్‌

భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది.
జిల్లా యంత్రాంగం, పోలీసు కమిషనరేట్లు, స్థానిక అధికారుల ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘింస్తే విపత్తు నిర్వహణ చట్టం, 2005 నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు మున్సిపల్‌ కార్పొరరేషన్లకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసిన అనంతరం ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది.

Related Articles

Latest Articles