Site icon NTV Telugu

Arms Recovered: ఇండో-పాక్ సరిహద్దులో భారీగా ఆయుధాలు పట్టివేత

Arms Recovered

Arms Recovered

Arms Recovered in Punjab: పాకిస్థాన్​ సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను బీఎస్‌ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో 6 మ్యాగజైన్‌లతో కూడిన 3 ఏకే-47 రైఫిళ్లు, 4 మ్యాగజైన్‌లతో మూడు ఎం3 రైఫిల్స్, 2 మ్యాగజైన్‌లతో 2 పిస్టల్స్ ఉన్నాయని బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ నుంచి అక్రమంగా ఆయుధాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఉదయం 7.10గంటలకు ఇండో-పాక్ సరిహద్దు వెంబడి రోజువారీ తనిఖీ సమయంలో 182 బెటాలియన్ ఫిరోజ్‌పూర్ సెక్టార్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ దళాలు సరిహద్దుకు దగ్గరగా ఉన్న పొలంలో ఒక వాలుపై రెండు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెట్లను తెల్లటి రంగు గుడ్డలో చుట్టారు. పెట్రోలింగ్ బృందం ప్యాకెట్‌ను తెరిచి చూడగా ఆయుధాలు లభించాయని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ విషయంపై ఫిరోజ్‌పూర్ జిల్లా స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్వాధీనం చేసుకున్న ఆయుధాలను బీఎస్ఎఫ్ అధికారులు పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Bilkis Bano Case: ”బిల్కిస్ బానో” కేసులో దోషులను విడుదలపై సుప్రీంలో సవాల్..

అంతకుముందు మరో సంఘటనలో ఆగస్టు 13న మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లాలో నిషేధిత సంస్థ గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ (జీఎన్‌ఎల్‌ఎ) దాచిపెట్టిన భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version