Site icon NTV Telugu

Mumbai Crime: వెంబడించి మరీ బ్రిటీష్ మహిళపై అత్యాచారం

British Woman Molested

British Woman Molested

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణం చోటు చేసుకుంది. బాత్రూమ్‌కి వెళ్ళిన ఓ బ్రిటీష్ మహిళను, వెంబడించి మరీ ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం బాంద్రాలోని ఓ క్లబ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ముంబైలోని బ్రిటీష్ రాయబార కార్యాలయంలో బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ (44) గత కొన్నేళ్ళుగా పని చేస్తోంది. మంగళవారం ఈమె తన భర్త, మరికొంతమంది స్నేహితులతో కలిసి.. బాంద్రాలోని ఓ క్లబ్‌‌కు వెళ్లింది. రాత్రి 11.30 గంటల సమయంలో ఆమె బాత్రూమ్‌కి వెళ్ళగా.. 35 ఏళ్ల యువకుడు ఆమెని వెంబడించాడు. అతడ్ని గమనించిన ఆ మహిళ, ఏదో తేడాగా ఉందని భావించి అక్కడినుంచి వెళ్లిపోవాలని అనుకుంది. కానీ, అతడు వెంబడించి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

వెంటనే బయటకొచ్చి జరిగిన విషయం తన భర్త, స్నేహితులకు చెప్పింది. వాళ్ళందరూ నిందితుడ్ని పట్టుకొని, అక్కడే బడితపూజ చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, వెంటనే ఘటనా స్థలికి చేరుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ముందైకి చెందిన ఘనశ్యామ్ లాలాచంద్ యాదవ్‌గా గుర్తించిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఎ), 509 కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version