Site icon NTV Telugu

Air India Plane Crash: ఎయిరిండియా విమాన దర్యాప్తు కోసం భారత్ రానున్న బ్రిటిష్ ఏజెన్సీ..

Air India

Air India

Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదాన్ని విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్‌కి రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలు పరిశోధించే ‘‘ ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB) ఈ ప్రమాద దర్యాప్తులో పాల్గొనబోతోంది. భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు మద్దతు ఇవ్వడానికి ఈ బృందాన్ని పంపిస్తున్నట్లు యూకే చెప్పింది. భారతదేశ దర్యాప్తులో తమకు ‘‘నిపుణుల హోదా’’ ఉంటుందని, ఎందుకంటే ప్రయాణికుల్లో యూకే పౌరులు కూడా ఉన్నారని తెలిపింది.

Read Also: Air India plane crash: విమానం టేకాఫ్ వెనక ఉన్న సైన్స్ ఇదే.. విమాన గతిని నియంత్రించే 4 శక్తులు..

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ తర్వాత క్షణాల్లోనే కుప్పకూలింది. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, విమాన సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ జాతీయులు, ఒక కెనెడియన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయపడ్డారు. మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది. అయితే, డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతుల సంఖ్యను చెబుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.

Exit mobile version