Brij Bhushan Sharan Singh: రెజ్లింగ్ బాడీ చీఫ్‌గా ఉన్న సమయంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరన్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని భారత ఏస్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ వంటి వారు ఆందోళనలు చేశారు. ఈ విషయం దేశవ్యాప్తంగా గతేడాది సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను బ్రిష్ భూషన్ నిరాధారమైనవిగా పేర్కొన్నారు. వీటి నేపథ్యంలో ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అతడికి టికెట్ కూడా నిరాకరించింది.
Read Also: Lavanya: మాల్వీ నా రాజ్ ను వదిలేయ్ ప్లీజ్.. ఈ కష్టం పగవాళ్లకు కూడా రావద్దు!
ఇదిలా ఉంటే, తాజాగా రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు ఈ రోజు కాంగ్రెస్‌లో చేరారు. దీనిపై బ్రిజ్ భూషన్ స్పందిస్తూ.. తనపై కాంగ్రెస్ కుట్ర చేసిందని, తాను అప్పట్లోనే ఈ విషయం చెప్పానని అన్నారు. కాంగ్రెస్ నేతలు దీపేందర్ హుడా, భూపేంద్ర హుడాలు కుట్రకు పాల్పడినట్లు చెప్పారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల గురించి ఆయన ఓ కార్యక్రమంలో కంట తడి పెట్టారు. గోండాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వేదికపై నుంచి ఎమ్మెల్సీ అవధేష్ సింగ్ మాట్లాడుతూ.. బ్రిజ్ భూషన్‌పై వచ్చిన లైంగిక ఆరోపనలు అబద్ధమని చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఆయన ఉద్వేగానికి లోనై కంటతడిపెట్టారు.
బ్రిజ్ భూషన్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ తనపై కుట్ర చేసిందని తాను ముందే చెప్పానని అన్నారు. హర్యానా కాంగ్రెస్ నేతలు దేపేంద్ర హుడా, భూపేంద్ర హుడాలు తనపై కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బ్రిజ్ భూషన్ ఉద్వేగానికి వెనక బీజేపీ అతడిని దూరం పెట్టడమే అని తెలుస్తోంది. గతంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ తనకు రెండో అవకాశాన్ని ఇవ్వకపోవడం బాధగా ఉందన్నారు.