ఈ మధ్య కాలంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న విషయాలకే.. ఉద్రేకానికి లోనై హత్యలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ యువతి తన లవర్ ను మరో వ్యక్తితో హత్య చేసింది. ఆ ఘటన మరవకే ముందే.. ప్రేమించిన అమ్మాయిని నడి రోడ్డుపై హత్య చేశాడు మరో యువకుడు. తాజాగా పెళ్లి చీర విషయంలో గొడవ జరగడంతో.. పెళ్లి కూతరునే హత్య చేశాడో పెళ్లి కొడుకు.. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.
Read Also: Neck Guards: ఏం ఐడియా గురూ.. .. పులులు బారి నుంచి రక్షించుకోవడం కోసం..
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో గంటలో పెళ్లి.. ఇంతలో వధువు పెళ్లి చీర విషయంలో పెళ్లి కొడుకు, వారి బంధువులతో పెళ్లికూతురికి వారి బంధువులకు మధ్య గొడవ జరిగింది. దీంతో పెళ్లి కొడుకు.. వధువును దారుణంగా హత్య చేశాడు. భావ్ నగర్ కు చెందిన సాజన్ బరయ్య, తనకు కాబోయే భార్య సోని రాథోడ్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, తలను గోడకు బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. 18 నెలల నుంచి వీరిద్దరూ సహాజీవనం చేశారు. అయితే గత శనివారం వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది.
Read Also:Winter Health Tips for Kids: చలి పెరుగుతోంది.. మీ పిల్లలు జాగ్రత్త సుమా..!
అయితే వధువు సోని చనిపోవడంతో సాజన్ భయపడి అక్కడినుంచి పారిపోయాడు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
