Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Bride In Pakistan Groom At The Border Marriage Is Difficult

India Pakistan: పాకిస్తాన్‌లో వధువు, బోర్డర్‌లో వరుడు.. పెళ్లి కష్టమే..

Published Date :April 26, 2025 , 4:37 pm
By Venu Goapl Reddy
  • పహల్గామ్ దాడితో క్రాస్ బోర్డర్ పెళ్లిళ్లపై ప్రభావం..
  • పెళ్లి కోసం బోర్డర్‌‌లో ఎదురుచూస్తున్న వరుడు..
  • సింధ్ ప్రావిన్సులో వధువు..
India Pakistan: పాకిస్తాన్‌లో వధువు, బోర్డర్‌లో వరుడు.. పెళ్లి కష్టమే..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్‌తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ నిర్ణయం పెళ్లిళ్లపై ప్రభావం చూపిస్తోంది. 1947లో దేశ విభజన జరిగినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా మంది పాకిస్తాన్ అమ్మాయిని లేదా అబ్బాయిని వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరిపై పహల్గామ్ ఎటాక్ ప్రభావం పడింది.

Also Read

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
  • Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
  • China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!
  • Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్‌గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
Add as a preferred
source on google

Read Also: CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం..

రాజస్థాన్‌కి చెందిన షైతాన్ సింగ్ నాలుగు ఏళ్ల క్రితం పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్సుకు చెందిన కేసర్ కన్వర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. వరుడి కుటుంబం వీసా కోసం అప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గురువారం ప్రభుత్వం అట్టారీ సరిహద్దుని మూసేయడంతో వివాహానిక మరో అడ్డంకి ఎదురైంది. పెళ్లికి సంబంధించి కొత్త బట్టలు సిద్ధం చేసుకుని, ఏప్రిల్ 30న పాకిస్తాన్‌లోని అమర్‌కోట్‌లో అమ్మాయి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం బార్మర్ జిల్లా నుంచి అట్టారికి బయలుదేరాడు. కానీ, వరుడి కుటుంబం అక్కడికి చేరుకునే సమయానికి బుధవారం అట్టారీ-వాఘా సరిహద్దు మూసేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు ఎవరిని సరిహద్దు దాటేందుకు అనుమతించడం లేదు.

ఈ దాడి రెండు కుటుంబాలపై ప్రభావం చూపించిందని వరుడి బంధువు సురేంద్ర సింగ్ అన్నారు. పాకిస్తాన్ నుంచి మా బంధువులు ఇక్కడికి వచ్చారు, వారు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని, దీంతో తాము చాలా నిరాశ చెందామని చెప్పారు. ఉగ్రదాడులు చాలా నష్టాన్ని కలిగిస్తాయని, సంబంధాలను దెబ్బతీస్తాయని అన్నారు. సైతాన్ సింగ్ వీసా మే 12 వరకు ఉంది. సకాలంలో సరిహద్దు తెరిస్తే వివాహం జరుగొచ్చని కుటుంబం అనుకుంటోంది. రాజస్థాన్‌లోని సోధా రాజ్‌పుత్ కమ్యూనిటీకి పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సుతో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో సరిహద్దులు దాటి ఇలా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • attari border
  • Attari border closed
  • Attari-Wagah border
  • Marraiage
  • Pahalgam terror attack

తాజావార్తలు

  • Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

  • YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

  • Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!

  • CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

  • Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions