Bride Flees With Boyfriend: మధ్యప్రదేశ్‌లోని గంజ్‌బసోడాలో వధువు తన బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోవడం వార్తల్లో నిలిచింది. రిసెప్షన్‌కి ముందే ప్రియుడితో లేచిపోయింది. రిసెప్షన్ కోసం సిద్ధం కావడానికి బ్యూటీ పార్లర్‌కి వెళ్లిన వధవు, తిరిగి వస్తుండగా కొంత మందితో కలిసి కారులో పారిపోయింది. ముందుగా, తన భార్యను కిడ్నాప్ చేశారని భర్త ఆరోపించాడు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించాడు. విచారణలో అసలు నిజం తెలిసి అంతా షాకయ్యారు.
గంజ్‌బసోడాకు చెందిన వధువు, ఆమె ప్రియుడు, అతడి సహాయులతో పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయంపై టిటి నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. టిటినగర్ ప్రాంతానికి చెందిన ఆశిష్ రాజక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తాను గంజ్‌బసోడాకు చెందిన రోష్ని సోలంకిని పెళ్లి చేసుకున్నానని, మంగళవారం వధువుతో తన ఇంటికి తిరిగి వచ్చినట్లు చెప్పారు. బుధవారం రిసెప్షన్ కోసం ఆశిష్ సోదరితో కలిసి వధువు బ్యూటీపార్లర్‌కి వెళ్లింది, ఆ తర్వాత మండపానికి తిరిగి వచ్చింది. అదే సమయంలో తన భార్యను కొందరు వ్యక్తులు బలవంతంగా వేరే కారులోకి లాక్కెళ్లి అక్కడి నుంచి పారిపోయినట్లు భర్త ఆశిష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి కోసం గంజ్‌బసోడాకు వెళ్ళినప్పుడు తన కారు నాలుగు టైర్లను ఎవరో పంక్చర్ చేశారని అతను ఇంకా చెప్పాడు.
Read Also: CM Chandrababu: మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్స్ తో భేటీకి సిద్ధమైన సీఎం చంద్రబాబు..
టిటినగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సుధీర్ అర్జారియా మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో వధువు స్వయంగా కారులోకి వెళ్లి, పారిపోయినట్లు తేలిందని చెప్పారు. వధువు కాల్ రికార్డుల ప్రకారం, పొరుగున ఉండే అనికేత్ మాలవీయతో సంబంధం పెట్టుకుందని వెల్లడైనట్లు తెలిపారు. బుధవారం వధువు రోష్ని, అనికేత్‌తో చాలాసార్లు మాట్లాడినట్లు తేలింది. వధువు, నిందితుల కోసం రెండు పోలీస్ టీమ్‌లు వెతుకున్నట్లు చెప్పారు. అయితే, మరుసటి రోజు శుక్రవారం, వధువు ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో.. అనికేత్‌తో తన ప్రేమ వ్యవహారం గురించి తన తల్లిదండ్రులకు చెప్పానని, కానీ వారు వినలేదని చెప్పింది. తనకు ఆశిష్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పినట్లు, తనకు తన ప్రియుడికి భద్రత కల్పించాలని కోరింది.