Uttarakhand tunnel rescue: రెస్క్యూ ఆపరేషన్‌కి బ్రేక్.. చెడిపోయిన డ్రిల్లింగ్ మిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand tunnel rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ కూలిపోయిన ఘటనలో మరో ఇబ్బంది ఎదురైంది. మరికొంత కాలం సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిల్క్యారా సొరంగం కూలిన ప్రదేశంలో దేశంలోని నిపుణులతో పాటు విదేశీ నిపుణులు రెస్క్యూ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. శుక్రవారం నాటికి రెస్క్యూ కార్యక్రమాలు విజయవంతమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read Also: Rani Rudrama: కేటీఆర్‌ను గద్దె దించి సిరిసిల్లలో నన్ను గెలిపించండి
Also Read
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ఇదిలా ఉంటే డ్రిల్లింగ్‌కి ఎంతో కీలకంగా ఉన్న ఆగర్ డ్రిల్లింగ్ మిషిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇప్పటి వరకు 46.8 మీటర్ల వరకు డ్రిల్లింగ్ పూర్తైంది. కార్మికులు సొరంగంలో 57 మీటర్ల లోపల ఉన్నారు. మరో 10 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డ్రిక్స్ మాట్లాడుతూ.. కార్మికులకు మరికొన్ని మీటర్ల దూరంలో ఉన్నామని, వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఆగర్ మిషిన్ చెడిపోయిందని, దాన్ని సరి చేస్తున్నామని, తిరిగి రేపు పనిచేయాల్సి ఉందని, ఇప్పటి వరకు డ్రిల్లింగ్ మిషన్ మూడు సార్లు చెడిపోయినట్లు తెలిపారు.
కార్మికుల చికిత్స కోసం ఇప్పటికే ప్రమాదం జరిగిన స్థలంలో అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి, వీరికి చికిత్స అందించేందుకు 41 బెడ్లలో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. నవంబర్ 12న సిల్క్యారా సొరంగం కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఉత్తర కాశీ జిల్లాలో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. గత 12 రోజులుగా కార్మికులు సొరంగంలోనే చిక్కుకుపోయారు. వీరికి ఆహారం, మందుల్ని ఓ పైప్ ద్వారా అందిస్తున్నారు. కూలిన సమయంలో కరెంట్ సదుపాయాలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కార్మికులు ఉన్న చోట వెలుతురు ఉంది. వారంతా సురక్షితంగా తిరిగి రావాలని స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు దేవతలకు ప్రార్థనలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి బాధితులతో మాట్లాడారు. మేము మీకు మరికొంత దూరంలోనే ఉన్నామని చెప్పారు.
#WATCH | On Silkyara tunnel rescue operation, International Tunneling Expert, Arnold Dix says, "We are only just metres away from finding passage to have the men back. But the men are safe. The auger machine has broken down, it is being repaired and it should be back up tomorrow.… pic.twitter.com/dtX8JtdU61
— ANI (@ANI) November 23, 2023
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!