NTV Telugu Site icon

Waqf bill: వక్ఫ్ బిల్లు ప్యానెల్ సమావేశంలో వాగ్వాదం.. మహిళలకు చోటుపై ప్రతిపక్షాల అభ్యంతరం..

Waqf Bill

Waqf Bill

Waqf bill: వక్ఫ్ (సవరణ) బిల్లుని పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీలు, ప్రతిపక్షల ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు తమపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో వరసగా రెండో రోజు కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాకౌట్ చేశాయి.

వక్ఫ్ బోర్డుల్లో మహిళలను చేర్చే ప్రతిపాదనపై బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, దిలీప్ సైకియా, అభిజిత్ గంగూలీ, తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ గొగోయ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కమిటీ చైర్‌పర్సన్ జగదాంబికా పాల్ నిబంధనల ప్రకారం పనిచేయడం లేదని, బీజేపీ ఎంపీలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మరోవైపు ప్రతిపక్ష ఎంపీలు చైర్‌పర్సన్‌ని దుర్భాషలాడుతున్నారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.

Read Also: India-Canada Ties: ఖలిస్తానీ సిక్కుల మద్దతు కోసమే ట్రూడో ప్లాన్.. అందుకే భారత్‌తో దౌత్యయుద్ధం..

వక్ఫ్ భూముల కుంభకోణాల్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రమేయం ఉందని కర్ణాటక రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ అన్వర్ మణిప్పాడి ఆరోపించడంతో ప్రతిపక్షాలు సోమవారం వాకౌట్ చేశాయి. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష ఎంపీలు ఈ ప్యానెల్ సమావేశాల్లో ఉన్నతమైన వ్యక్తులపై నిరూపించబడని ఆరోపణలు చేయరాదని పేర్కొన్నారు.

బీజేపీ ఎంపీ నిషికాంద్ దూబే జేపీసీ చైర్‌పర్సన్ జగదాంబికా పాల్‌కి లేఖ శారు. దీంట్లో వక్ఫ్ బిల్లుపై వచ్చిన భారీ 1.25 కోట్ల సబ్మిషన్లపై తీవ్రమైన ఆందోళన లేవనెత్తారు.కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా దర్యాప్తు చేయాలని కోరారు. ఛాందసవాద గ్రూపులు, జకీర్ నాయక్ వంటి వ్యక్తులు లేదా ‘‘విదేశీ శక్తుల’’ ప్రమేయం ఉందొచ్చని దూబే ఆరోపించారు.