Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Brain Eating Amoeba Deaths Kerala Symptoms Prevention

Brain-Eating Amoeba: ‘‘మెదడు తినే అమీబా’’ కేరళలో 19 మందిని చంపేసింది.. ఇది ఎలా వ్యాపిస్తుంది, అడ్డుకోవడం ఎలా..?

Published Date :September 17, 2025 , 6:39 pm
By Venu Goapl Reddy
  • కేరళను వణికిస్తున్న ‘‘మెదడును తినే అమీబా’’..
  • ఈ ఏడాది ఇప్పటికే 19 మంది మృతి..
  • వెచ్చని, నిలిచిన నీటిలో ఉండే అమీబా..
  • ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు, చికిత్స, నివారణ..
Brain-Eating Amoeba: ‘‘మెదడు తినే అమీబా’’ కేరళలో 19 మందిని చంపేసింది.. ఇది ఎలా వ్యాపిస్తుంది, అడ్డుకోవడం ఎలా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Brain-Eating Amoeba: కేరళను ‘‘మెదడును తినే అమీబా’’ కలవరపెడుతోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటస్(PAM) పిలువబడే ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు.ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వస్తుంది. ఇది సోకిన వ్యక్తిలో మెదడును ఈ అమీబా టార్గెట్ చేస్తుంది. ఈ ఏడాది కేరళలో 61 కేసుల్లో, 19 మంది మరణించారు. వీరిలో చాలా వరకు మరణాలు కొన్ని వారాల్లోనే నమోదయ్యాయి. కేరళ తీవ్రమైన ప్రజారోగ్య సమస్యతో పోరాడుతోందని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అన్నారంటే, ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అసలేంటి ఈ ఇన్ఫెక్షన్.?

PAM కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ మెడదు కణజాలాన్ని నాశనం చేస్తుంది. చాలా సందర్భాల్లో తీవ్రమైన మెదడు వాపు, మరణానికి కారణమవుతుంది. ఇది వెచ్చని, నిలిచి ఉన్న నీటి నుంచి ఈ క్రిమి మానవశరీరంలోకి చేరుతుంది. ఇది ముక్కు ద్వారా మెదడును చేరి, ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఈ అమీబాలు ఉన్న చెరువుల్లో , నీటి కుంటల్లో ఈతకొట్టడం, డైవింగ్ చేయడం, స్నానం చేయడం ద్వారా సంక్రమించే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు నీటి ఉష్ణోగ్రతల్ని పెరగడం, ఈ వ్యాధితో ముడిపడి ఉంది.

లక్షణాలు:

PAM లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రధానంగా దీనిని నిర్ధారించడం కష్టం. దీని లక్షణాలు బ్యాక్టీరియల్ మెనింజైటిస్ వలే ఉంటాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి మెనింజైటిస్ లక్షణాలు ఉండటంతో డాక్టర్లు ఇదే వ్యాధి అనుకుని PAM నిర్ధారణ ఆలస్యం చేస్తుంటారు. దీంతో రోగిని మరణానికి కారణమయ్యే సెరిబ్రల్ ఎడెమా నుంచి రక్షించడం కష్టం అవుతుంది. లక్షణాలు క్రిమి సోకిన ఒకటి నుంచి 9 రోజుల మధ్య కనిపించవచ్చు. వాటి తీవ్రత ప్రారంభమైన గంటల నుంచి 1-2 రోజుల్లో మరణం సంభవించే అవకాశం ఉంటుంది.

చికిత్స ఏంటి..?

గత ఆరు దశాబ్ధాలలో ఈ వ్యాధి నుంచి బయటపడిన వారు ప్రి-సెరిబ్రల్ దశలో నిర్ధారణ జరిగిన వారే. రోగ నిర్ధారణ ఈ వ్యాధిలో అత్యంత కీలకం. ప్రారంభ దశలో నిర్ధారణ, యాంటీమైక్రోబయల్ కాక్టెయిల్ ను సకాలంలో రోగికి అందించడం ప్రారంభిస్తే, ప్రాణాలు కాపాడవచ్చు.

కేరళలో 2016లో తొలిసారిగా ‘‘మెదడును తినే అమీబా’’ వ్యాధిని గుర్తించారు. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, అది నిలువ ఉన్న కొలను, చెరువుల్లో స్నానాలకు, ఈతకు దూరంగా ఉండటం. నీటిలోకి ప్రవేశించే ముందు ప్రజలు ముక్కు క్లిప్ ధరించాలని సూచించారు. బావులు, చెరువుల్ని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Brain Eating Amoeba
  • climate change health risk
  • disease prevention
  • health alert
  • Kerala

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions