Boycott Turkey: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ పై మెరుపుదాడి చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ నేపథ్యంలో భారత్ పై దాడి చేసేందుకు టర్కీ పాకిస్తాన్‌కు 350కి పైగా డ్రోన్‌ల సహాయంతో పాటు సైనిక సిబ్బందిని కూడా పంపిందని నిఘా వర్గాలు తెలిపాయి.
Read Also: NVSS Prabhakar: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్.. రేవంత్ స్థానంలో కేసీఆరే సీఎం..!
అయితే, పాకిస్తాన్ కు సహకరించిన టర్కీ, చైనాపై ప్రతీకారం తీర్చుకోవడానికి భారతీయ వ్యాపారులు ఆ రెండు దేశాలకు చెందిన ఉత్పత్తులను స్వచ్ఛందంగా బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. టర్కీ పర్యాటక రంగంతో పాటు దిగుమతి ఉత్పత్తుల బహిష్కరణతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా టర్కీ యాపిల్స్, మార్బుల్స్, పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. పూణె లాంటి ప్రాంతాల్లో వ్యాపారులు టర్కీ యాపిల్స్‌ను బహిష్కరిస్తున్నారు. అలాగే, టర్కీ మార్బుల్స్‌ను ఇంటీరియర్ డిజైన్, నిర్మాణ రంగాల్లో ఉపయోగించకుండా ఉండాలని భారతీయులు నిర్ణయించుకున్నారు. ఇండియా నిర్ణయంతో టర్కీకి చెందిన నిర్మాణ ఉత్తత్తుల దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Read Also: Operation Sindoor: ఐఎన్‌ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టు అష్టదిగ్బంధనం
ఇక, 2024లో టర్కీ పర్యాటక ఆదాయం $61.1 బిలియన్ (సుమారు ₹5 లక్షల కోట్లు)గా నమోదైంది. 2024 లో భారతీయ పర్యాటకుల సంఖ్య 20.7 శాతం పెరిగింది.
టర్కీ పర్యాటక రంగానికి, భారతీయుల పర్యటనతో పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. భారతీయుల బహిష్కరణ ఉద్యమం కొనసాగితే, టర్కీ పర్యాటక రంగానికి ఈ వృద్ధి భారీగా తగ్గిపోవచ్చు. భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గడం, టర్కీ పర్యాటక ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
