#BoycottNothing: ఆగ్రహంలో సౌత్ ఇండియన్స్.. అసలు కథ ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అనుకున్నదొకటి, అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట’.. ఇక్కడ ప్రస్తుతానికి పిట్ట స్థానంలో ‘నథింగ్’ అని పెట్టుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఆ మొబైల్ కంపెనీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు అలాంటివి మరి! కొత్తగా వస్తోన్న ఫోన్ కాబట్టి, ప్రాంక్‌తో కాస్త మార్కెటింగ్ పెంచుకుందామని ఒక ప్లాన్ వేసుకుంటే.. అది బెడిసికొట్టి దక్షిణ భారతీయుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఏకంగా ‘బాయ్‌కాట్ నథింగ్’ అనే డేంజర్ బెల్స్ మోగేదాకా పరిస్థితిని తెచ్చుకుంది. అంతలా ఆ సంస్థ ఏం చేసింది? పదండి.. ఆ వివరాల్లోకి వెళ్దాం.
సాధారణంగా ఏదైనా ఒక కొత్త మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకి వస్తోందంటే.. విడుదలకు కొన్ని రోజుల ముందే యూట్యూబర్స్‌తో ‘అన్‌బాక్స్’ వీడియోలు చేయిస్తుంటారు. తమ ప్రొడక్ట్‌ని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ! లండన్-బేస్డ్ స్టార్టప్ కంపెనీ నథింగ్ కూడా తన ‘నథింగ్ ఫోన్ 1’ కోసం అదే స్ట్రాటజీని అనుసరించింది. కానీ, రొటీన్‌కి భిన్నంగా కొత్తగా ట్రై చేయాలని ప్లాన్ వేసింది. ఈ ప్లాన్‌లో భాగంగానే ‘ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు’ యూట్యూబర్‌తో ఓ ప్రాంక్ వీడియో ప్లాన్ చేసింది. అతడు బాక్స్ ఓపెన్ చేయగానే.. అందులో మొబైల్ ఫోన్‌కి బదులు, ‘‘ఈ ఫోన్ కేవలం ఉత్తరాది జనాల కోసం మాత్రమే, దక్షిణాది ప్రజల కోసం కాదు’’ అనే లెటర్ ఉంది. ఆ యూట్యూబర్ ఆ లెటర్ తీసి అలా చదవడమే ఆలస్యం.. కోపాద్రిక్తురాలైన సౌత్ ఇండియన్స్, వెంటనే ‘డియర్ నథింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టేశారు.
Also Read
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
అదొక ఫేక్ లెటర్ అని, అదొక ప్రాంక్‌లో భాగమని పూర్తిగా రివీల్ చేసేలోపే.. సౌత్ ఇండియన్ తీవ్ర ఆగ్రహావేశానికి గురై, తమ కోపాన్ని ఆ సంస్థపై ప్రదర్శించడం మొదలుపెట్టారు. ‘బాయ్‌కాట్ నథింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ‘‘ఇదెక్కడి పక్షపాతం, మ్యానుఫ్యాక్చర్ చేస్తోందే తమిళనాడులో, అలాంటిది సౌత్ ఇండియాలో కాకుండా, నార్త్ ఇండియన్స్‌కి మాత్రమే ఫోన్ అందుబాటులోకి తీసుకురాడమేంటి’’ అంటూ ఏకిపారేస్తున్నారు. అయితే.. ఇంకా చాలామందికి ఆ లెటర్ ఫేక్ అని తెలియదు. అందుకే, ఆ రెండు హ్యాష్‌ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇదీ.. అసలు సంగతి!
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!