NTV Telugu Site icon

Rajasthan: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన 9 ఏళ్ల బాలుడిని రక్షించిన అధికారులు..

Borewell

Borewell

Rajasthan: బోరుబావి ప్రమాదాలు మనం చాలా సార్లు చూశాం. బోరుబావిలో పడిపోయిన చిన్నారుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారే ఉన్నారు. అధికారులు ఎన్ని రోజులు ప్రయత్నించినా చివరకు వారి మృతదేహాలు మాత్రమే బయటకు వచ్చేవి. కానీ రాజస్థాన్ లో ఓ 9 ఏళ్ల పిల్లాడు బోరుబావి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థార్ లోని జైపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Read Also: Naga Chaitanya: మా తాత.. ఎన్టీఆర్ గురించి ఇంట్లో అలా చెప్పేవారు

పూర్ జిల్లాలోని శనివారం ఉదయం బోరుబావిలో పడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ఏడు గంటల పాటు శ్రమించి రక్షించారు. బాలుడు అక్షిత్ ఆడుకుంటూ తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిపై ఉన్న రాయిని ఇతర పిల్లలు తొలగించడంతో అది చూడకుండా అక్షిత్ అందులో పడిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన భోజ్‌పురా గ్రామంలో చోటుచేసుకుంది. బాలుడు 200 ఫీట్ల బోరుబావిలో చిక్కుకున్నాడు. దాదాపుగా 7 గంటలు కష్టపడిన తర్వాత బాలుడ్ని విజయవంతంగా రెస్క్యూ చేశారు. బాలుడి పరిస్థితి నిలకడ ఉన్నట్లు, ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

అక్షిత్ బోరుబావిలో పడిన ఘటన అధికారులకు చేరడంతోనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్), ఎస్డీఆర్ఎఫ్, రాజస్థాన్ పోలీస్ బృందాలు రెస్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. రెస్క్యూ సమయంలో బోరులోకి పిల్లాడికి ఆక్సిజన్, నీరు, తినడానికి బిస్కెట్ల సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఇనుప వలను బోరు బావిలోకి పంపిన అధికారులు, దానికి అక్షిత్ చిక్కుకునేలా చేసి పైకి తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యవసాయం మంత్రి లాల్ చంద్ కటారియా సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ను దగ్గరుండి పర్యవేక్షించారు.