విమాన ప్రమాదాలతో భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులను బాంబు బెదిరింపులు హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో 322 మంది ఉండడంతో తీవ్ర కలకలం రేగింది. టేకాఫ్ అయిన ఎనిమిది గంటల తర్వాత సిబ్బందికి బాంబు బెదిరింపు రావడంతో ముంబైకి తిరిగి వచ్చింది. 303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో ఉన్న బోయింగ్ 777 విమానం అజర్‌బైజాన్ మీదుగా ప్రయాణిస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫ్లైట్ ను ముంబైకి మళ్లించారు. ల్యాండింగ్ తర్వాత, బాంబు తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలు ఏమీ లేకపోవడంతో బెదిరింపు హెచ్చరిక నకిలీదని గుర్తించారు.
Also Read:MLC Nominations: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం
ఎయిర్ ఇండియా విమానం ముంబై నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి ఉదయం 10.25 గంటలకు ముంబైకి తిరిగి వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయానికి విమానం నంబర్ AI-119, ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. ఈ విమానం రేపు ఉదయం 5 గంటలకు బయలుదేరుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణీకులకు వసతి, భోజనం, ఇతర సహాయాన్ని అందించినట్లు తెలిపింది.