NTV Telugu Site icon

Blue Drum Sales: ఒక్క హత్య ‘‘డ్రమ్‌’’ బిజినెస్‌నే దెబ్బ తీసింది.. మీరట్ మర్డర్‌తో పడిపోయిన సేల్స్..

Meerut Murder

Meerut Murder

Blue Drum Sales: ఇటీవల దేశవ్యాప్తంగా మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విదేశాల్లో పనిచేసే సౌరభ్, తన కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన సమయంలో, భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు దారుణంగా హత్య చేశారు. గుండెల్లో పొడిచి, గొంతు కోసి హతమార్చాడు. చివరకు శరీరాన్ని 15 ముక్కలుగా చేసి, ఒక డ్రమ్‌లో సిమెంట్ వేసి కప్పేవారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు నిందితులు కొన్ని రోజులు పాటు ఎంజాయ్ చేశారు.

Read Also: RK Roja: కూటమి ప్రభుత్వంలో ఆ దేవదేవుడికి కూడా నిదుర లేకుండా పోతుంది..!

ఇదిలా ఉంటే, ఈ హత్య డ్రమ్ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మీరట్ హత్య ‘‘బ్లూ కలర్ డ్రమ్‌’’తో ముడిపడి ఉండటంతో వీటిని కొనేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు. ఈ సంఘటన అలీఘర్‌లో హార్డ్‌వేర్ వస్తువు అయిన బ్లూ డ్రమ్ అమ్మకాలను ప్రభావితం చేసింది. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, పదే పదే మీడియా ఈ బ్లూ డ్రమ్‌‌ని చూపించడంతో ప్రజలు భయపడుతున్నారు. ఈ డ్రమ్‌ నేపథ్యంతో కొందరు సోషల్ మీడియా రీల్స్ కూడా చేశారు. నీలి రంగు డ్రమ్ కనిపిస్తే, మీరట్ మర్డర్ ప్లాన్ చేస్తున్నారా..? అని కొందరు జోక్ చేస్తున్నారు. దీంతో చాలా మంది దీనిని కొనేందుకు నిరాకరిస్తున్నారు.