వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ భారత్‌లోనే తక్కువ..! స్పష్టం చేసిన నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాను కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పుడు ప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన పెరిగినా.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన మొదట్లో.. ఆది తీసుకోవడానికి వెనుకడుగు వేసినవారు ఎందరో.. ఇప్పటికీ చాలా మందిలో వ్యాక్సిన్ భయం లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం.. వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. మళ్లీ కోవిడ్ బారిన పడుతున్నారు.. వ్యాక్సినేషన్ తర్వాత కొందరు ప్రాణాలే కోల్పోయారు.. ఇలా అనేక వార్తలు హల్ చల్ చేశాయి.. అయితే, భారత్‌లో వ్యాక్సిన్లతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగానే ఉన్నాయని స్పష్టం చేసింది అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ (ఏఈఎఫ్ఐ) నివేదిక.. వ్యాక్సినేషన్.. దానివల్ల కలుగుతోన్న దుష్పరిణామాలపై నివేదికను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది ఏఈఎఫ్ఐ.
ఆ నివేదికలో వ్యాక్సినేషన్‌తో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌ను వివరంగా పేర్కొంది అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్… భారత్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి పరిణామాలు జరిగాయని తెలిపింది.. ఇక, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో అలాంటి కేసులేవీ గుర్తించలేదని స్పష్టం చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టినట్టు కొన్ని వార్తలు రాగా.. అయితే అలాంటి కేసులు భారత్‌లో అతి స్వల్పమని పేర్కొంది ఏఈఎఫ్ఐ. ఇండియాలో ఇప్పటివరకు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను 650,819 మందికి ఇస్తే.. వారిలో 700 మందిలో మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని తెలిపింది. ఇక, వాటిలో 498 కేసులపై లోతుగా అధ్యయనం చేయగా కేవలం 26 మందికి మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టినట్టు వివరించింది.. మరోవైపు.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టిన కేసులేవీ నమోదు కాలేదని స్పష్టం చేసింది. అయితే, వ్యాక్సిన్ అంటే.. మొదట్లో అందరిలో భయాలే.. కానీ, క్రమంగా అవి తొలగిపోయినా.. ఇంకా కొంతమందిని భయం వెంటాడుతూనే ఉంది. మరోవైపు.. వ్యాక్సిన్ కోసం ఇప్పుడు కోట్లాది మంది ఎదురుచూస్తున్నా.. కొరత వేధిస్తోంది.. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ల కొరతకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!