Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: భవనం పైకప్పుపై దొరికిన బ్లాక్ బాక్స్..

Air India Plane Crash

Air India Plane Crash

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికింది. విమానం కూలిపోతున్న సమయంలో సమీపంలోని డాక్టర్స్ హాస్టల్స్ భవనాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు అదే బిల్డింగ్ పైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీంతో, 265 మందిని బలి తీసుకున్న ఈ ఘోర దుర్ఘటనకు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మందికి పైగా సిబ్బంది విమాన ప్రమాద స్థలంలో పౌరవిమానయాన శాఖ బృందాల్లో చేరారు. DFDR (డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్) దొరకడంతో దీనిని విశ్లేషణ కోసం పంపించనున్నారు.

Exit mobile version