Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjps Vinod Tawde Sends Legal Notice To Congress Apologise Or Face Defamation

BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’.. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు..

Published Date :November 22, 2024 , 5:12 pm
By BV Reddy
  • మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’..
  • కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన బీజేపీ నేత..
  • రాహుల్ గాంధీ, ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
  • లేకపోతే పరువునష్టం కేసు ఎదుర్కోవాలన్న వినోద్ తావ్డే..
BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’.. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వినోద్ తావ్డే, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుప్రియా శ్రీనాట్, రాహుల్ గాంధీలకు లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ మంగళవారం ఆరోపించిన నేపథ్యంలో తావ్డే లీగల్ నోటీసు వచ్చింది.

తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని, నిరాధారమైనవని, దుష్ర్పవర్తనతో చేసినవని తావ్డే నోటీసుల్లో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో తనపై ఆరోపణలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు, ఒక హోటల్‌లో చొరబడిన బీవీఏ కార్యకర్తలు అక్కడే ఉన్న తావ్డే రూ. 5 కోట్లతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడనే వీడియోని పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. హోటల్ గదుల నుంచి రూ. 9.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మంగళవారం తెలిపారు.

తావ్డే ఈ ఆరోపణల్ని ఖండించారు. తాను ఎన్నికల విధానాలపై పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకత్వం మాత్రమే అందిస్తున్నానని, ప్రత్యర్థి హోటల్‌లో డబ్బు పంపినీ చేసేంత తెలివితక్కువ వాడిని కాదని అన్నారు. వివంతా హోటల్ ఠాకూర్‌లకు చెందినదని, వారి హోట‌ల్‌కి వెళ్లి అక్కడ డబ్బు పంచేంత మూర్ఖుడిని కాదనని తావ్డే మీడియా సమావేశంలో అన్నారు. ఈ వివాదానికి సంబంధించి పోలీసులు మంగళవారం తావ్డే, బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్ తదితరులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. తావ్డేపై ఎన్నికల సంఘం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • defamation case
  • Maharashtra elections 2024
  • rahul gandhi

తాజావార్తలు

  • Sri Rama Navami 2026: శ్రీరాముడి పూజా విధానం, శుభ ముహూర్తం, హారతి విధానం

  • Bro 2 Update: పవన్ కళ్యాణ్ ‘బ్రో 2’పై సముద్రఖని క్లారిటీ.. ఇంతకీ ఏమ్మన్నాడంటే?

  • Petrol and Diesel Prices Drop: గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం భారీగా తగ్గింపు

  • Virat Kohli New Tattoo: ఐపీఎల్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

  • Anantapur Crime: సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో పోలీసులపై నిందితుల దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు..

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions