NTV Telugu Site icon

Lok Sabha Elections: బీజేపీ 305 సీట్లు గెలుస్తుంది.. అమెరికా పొలిటికల్ సైంటిస్ట్ అంచనా..

Pm Modi

Pm Modi

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలు తుది దశకు వచ్చాయి. మరో రెండు విడతల్లో దేశంలోని 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగియనున్నాయి. అయితే, ఈ సారి ఎన్నికల్లో మొత్తం అంకెల చుట్టూ తిరుగుతోంది. బీజేపీ స్వయంగా 370 సీట్లు, ఎన్డీయే కూటమి మొత్తంగా 400 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ సారి బీజేపీ కేవలం 200 కన్నా తక్కువ స్థానాలకే పరిమితమవుతుంది, ఇండియా కూటమి 300 స్థానాలను కన్నా ఎక్కువ గెలుచుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 305(+/- 10) గెలుచుకుంటుందని అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్, గ్లోబల్ పొలిటికల్ రిస్క్ కన్సల్టెంట్ ఇయామ్ బ్రెమ్మర్ మంగళవారం జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచ రాజకీయ దృక్కోణంలో భారత సార్వత్రిక ఎన్నికలు స్థిరంగా కనిపించే ఏకైక విషయమని, మిగతావన్నీ అమెరికా ఎన్నికలతో సహా సమస్యాత్మకంగా కనిపిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలు నిశ్చితిలో ఉన్నాయని అన్నారు. ప్రపంచీకరణ కంపెనీలు కోరుకున్న విధంగా జరగడం లేదని చెప్పారు. రాజకీయాలు ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించడం..యుద్ధాలు, యూఎస్-చైనా సంబంధాలు, అమెరికా ఎన్నికలు అన్ని ఇందులో భాగమే అని అన్నారు. ఈ ఒత్తిళ్లు మరింత ప్రతీకూలంగా ఉన్నాయని, వాస్తవానికి రాజకీయంగా స్థిరంగా కనిపించే ఏకైక విషయం భారతదేశ ఎన్నికలే అని, మిగతావన్నీ సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పారు.

Read Also: Virat Kohli: ‘నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా’.. విరాట్ సంచలన వ్యాఖ్యలు..

ఏడు దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 295-315 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ 2014లో 282( ఎన్డీయే 336 సీట్లు), 2019లో 303 సీట్లు(ఎన్డీయే కూటమి 353) గెలుచుకుంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. 2019లో సాధించిన సీట్లకు అటూ ఇటూగా లేదా, దాని కన్నా కొన్ని స్థానాలు ఎక్కువగా బీజేపీ గెలుచుకుంటుందని, ఆ పార్టీ చెప్పినట్లు 370 సీట్లు సాధించలేదని చెప్పారు.

ప్రపంచంలోని పలు దేశాల్లో ఎన్నికలు ఉన్నాయని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సున్నితమైన ఎన్నికల ప్రక్రియను కలిగి ఉందని బ్రెమ్మర్ ప్రశంసించారు. బలమైన ఆర్థిక పనితీరు, స్థిరమైన సంస్కరణలతో మోడీ మూడోసారి గెలువబోతున్నారని అన్నారు. దశాబ్ధాలుగా భారత్ పనితీరును పలు దేశాలు తక్కువగా చూసినప్పటికీ, ప్రస్తుత అమెరికన్ సీఈఓలు భారత్ వస్తున్నారని, తాము వృద్ధిని చూస్తున్నామని, భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని చూశామని, బహుశా 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చని ఆయన అన్నారు. మిగిలిన దేశాలతో తన స్నేహాన్ని నిర్వహిచే విషయంలో భారత్ శక్తివంతంగా మారడాన్ని ప్రపంచం చూస్తోందని చెప్పారు.