NTV Telugu Site icon

K. Laxman: ధన్యవాద్ మోడీ పేరుతో సమ్మేళన సదస్సులు.. ఓబీసీ మోర్చా నిర్ణయం

L.;akshman

L.;akshman

K. Laxman: ధన్యవాద్ మోడీ పేరుతో ఓబీసీ సమ్మేళన సదస్సులు నిర్వహించాలని ఓబీసీ మోర్చా నిర్ణయించిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మహా సంపర్క్ అభియాన్ పేరుతో ప్రధాని స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు నివేదిక రూపంలో ప్రజల ముందుకు రానున్నామని తెలిపారు. మే 30 నుంచి జూన్ 30 వరకు తెలంగాణలోని ప్రతి ఊరికి బీజేపీ వెళ్తుందని వెల్లడించారు. ప్రపంచ దేశాలు మోడీ నాయకత్వాన్ని ఆరాధిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాలవారీగా అభివృద్ధి నివేదికలు రూపొందించి ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 303 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామన్నారు. జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిల్లో కార్యవర్గ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ధన్యవాద్ మోడీ పేరుతో ఓబీసీ సమ్మేళన సదస్సులు నిర్వహించాలని ఓబీసీ మోర్చా నిర్ణయించిందని అన్నారు. తెలంగాణా అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని అన్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్‌ పంటనష్టపోతే స్పందించలేదన్నారు. పంట నష్టం జరిగి రైతులు, కౌలు రైతులు ఇబ్బందుల్లో ఉంటె కేసీఆర్‌ సర్కార్ పట్టించుకోలేదన్నారు. 10 వేలు ఇస్తామని చెప్పిన టి సర్కార్ ఒక్కరూపాయి విడుదల చేయలేదన్నారు.

Read also: Revanth Reddy: నన్ను ఎలా వాడుకోవాలో అని అధిష్టానం ఆలోచిస్తుంది..!

కేంద్రప్రభుత్వ పథకం ఫసల్ భీమా ను తెలంగాణలో అమలు చేయకుండా రైతుల నోట్లో మన్నుకొట్టారని ఆరోపించారు. కేసీఆర్‌ ది ది 30 శాతం కమిషన్ సర్కార్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో బీఆర్ఎస్ కు బీజేపీ నే ప్రత్యామ్యాయమన్నారు. బీఆర్‌ఎస్‌ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ రెండు ఒక్కటే అని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కర్ణాటక ప్రమాణస్వీకారానికి పిలవలేదన్నారు. కాంగ్రెస్ ని గెలిపించేందుకు జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ కు మళ్లేలా కేసీఆర్‌ వ్యవహరించారన్నారు. బీఆర్‌ఎస్‌ తో కలిసే పరిస్థితి వస్తుందంటూ స్వయంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని అన్నారు. కవితను అరెస్ట్ చేసేది దర్యాప్తు సంస్థలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జోక్యం ఉండదని అన్నారు. మేము చేరికలపై ఆధారపడలేదన్నారు. జాయినింగ్స్ నిరంతర ప్రక్రియ అన్నారు. మోడీ మీద ఉన్న ఆక్రోశంతోనే విపక్షాలు పార్లమెంట్ భవన ప్రారంభ వేడుకలను బాయికాట్ చేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రధాని హోదాలోనే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ ప్రారంబోత్సవాలు చేసిన సందర్భాలున్నాయన్నారు.
Etela Rajender: కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ లోకి వెళ్లారు.. ఈటెల సంచలన వ్యాఖ్యలు