NTV Telugu Site icon

Congress Vs BJP: కుంభమేళాకు హాజరుకాకపోవడంపై నేతల మధ్య మాటల యుద్ధం

Bjp Vs Congress

Bjp Vs Congress

కుంభమేళా, అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధాని మోడీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్‌పై బీజేపీ మాటల దాడి చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. 2024లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరకాలేదు. 2025లో మహా కుంభమేళాకు కాంగ్రెస్ నాయకులు హాజరుకాలేదని.. వాళ్లంతా హిందూ వ్యతిరేకులని బీజేపీ ధ్వజమెత్తింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఫొటోలు పెట్టి విమర్శలు చేసింది.

ఇది కూడా చదవండి: Prashanth Reddy: ఎస్‌ఎల్‌బీసీని మంత్రులు వినోద యాత్రగా మార్చుకున్నారు

‘‘రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తుంది. వారు బాబర్ (అయోధ్యలోని బాబ్రీ మసీదు) నిర్మించిన మసీదుకు మూడుసార్లు వెళ్లారు కానీ రాముడి ఆలయంలో శ్రీరాముని దర్శనం కోసం వెళ్లలేదు. రాహుల్ గాంధీ తరచుగా రాయ్‌బరేలికి వెళ్తారు. కానీ ఆయన ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరిగే ప్రదేశానికి వెళ్లలేకపోయారు. ఇది కేవలం 2 గంటల రెండు నిమిషాల 120 కి.మీ. దూరంలో ఉంది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి పేర్కొన్నారు.

ఇక హిందీ పోస్టులో బీజేపీ మరో విమర్శ చేసింది. ‘‘శతాబ్దాల పోరాటం మరియు నిరీక్షణ తర్వాత అయోధ్యలో ఒక గొప్ప రామాలయం నిర్మించబడింది. మోడీ చేతుల మీదుగా జనవరి 22, 2024న రామ్‌లాలా ప్రాణ ప్రతిష్ట జరిగింది. కానీ ఆలయ నిర్మాణాన్ని ఎప్పుడూ వ్యతిరేకించే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఆహ్వానం అందుకున్న తర్వాత కూడా వేడుకకు హాజరు కాలేదు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును సంతృప్తి పరచుకోవడానికి హిందువుల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీస్తుంది’’ అని బీజేపీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: AA23 : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మరొక హీరో.?

బీజేపీ విమర్శలను మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఖండించారు. బీజేపీ వాదన ప్రకారం.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వంటి మిత్రపక్షాల నాయకులు కూడా కుంభమేళాకు హాజరుకాలేదు. వీళ్లను కూడా హిందూ వ్యతిరేకులుగా పరిగణించాలా? అని బీజేపీని ప్రశ్నించారు.