Site icon NTV Telugu

BJP: శ్రద్ధా వాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారు..?

Uddhav Thackeray

Uddhav Thackeray

BJP Slams Uddhav Thackeray For Silence On Shraddha Case: శ్రద్ధావాకర్ హత్య రాజకీయ దుమారాన్ని రాజేసింది. ఇటీవల ఢిల్లీ శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని 35 ముక్కులుగా నరికేశాడు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య అగ్గిరాజేసింది. శ్రద్ధావాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. కొత్త హిందువు అనే భావన తీసుకురావడం ద్వారా ఠాక్రే హిందువులను విభజించాలని చూస్తున్నారని ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ గురువారం ఆరోపించారు.

Read Also: Pakistan: “పుల్వామా దాడి”కి పాక్ కొత్త ఆర్మీ చీఫ్ కారణం.. భారత్ అంటే నరనరాన వ్యతిరేకతే..

మరాఠీ ముస్లింకు మద్దతు ఇస్తానని ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు అన్నారని ప్రశ్నించారు ఆశిష్ షెలార్. జైనులు, గుజరాతీలు, నార్త్ ఇండియన్స్ తో ఆయను ఎలాంటి సమస్యలు ఉన్నాయని ప్రశ్నించారు. కేవలం ముస్లిం ఓట్లను పొందేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ముందు ముంబైలో జరిగిన ర్యాలీలో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రేపై ప్రశ్నల వర్షం కురిపించింది.

ముంబై అమ్మాయి శ్రద్ధా వాకర్ అనే అమ్మాయిని అఫ్తాబ్ హత్య చేసి ముక్కలుగా నరికాడు. డిసెంబర్ 22, 2020న శ్రద్ధా వాకర్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో మహారాష్ట్రలో శివసేన, మహావికాస్ అఘాఢి ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో శ్రద్ధా తనను అఫ్తాబ్ అనే వ్యక్తి చంపేస్తానంటున్నాడని పోలీసులకు లేఖ రాసిన పట్టించుకోలేదు. అప్పటి హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని బీజేపీ ఆరోపించింది. ఇటీవల ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, బీహార్ పర్యటనపై ఆశిష్ షెలార్ ఎగతాళి చేశాడు. లాలూ దాణా కుంభకోణం కేసులో ఎంత తిన్నాడో తెలుసుకునేందుకు ఆదిత్య ఠాక్రే, తేజస్వీ యాదవ్ ను కలిశాడంటూ విమర్శించారు. జ్ఞాన్‌వాపి సమస్యపై కోర్టు ఆదేశాలను ఉద్ధవ్ జీ కూడా స్వాగతించలేదని అన్నారు.

Exit mobile version