Site icon NTV Telugu

BJP: ‘‘హిందీ వద్దు, ఉర్దూ ముద్దా..?’’ స్టాలిన్‌పై బీజేపీ ఫైర్..

Stalin

Stalin

BJP: తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య ‘‘త్రిభాషా విధానం’’, ‘‘హిందీ భాష’’పై వివాదం నెలకొంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీ భాషను తమిళనాడుపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం ఎంకే స్టాలిన్, ఆయన డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో, ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంపై ఏ భాషను బలవంతం చేయమని చెప్పారు. అయినా కూడా ఈ వివాదానికి అడ్డుకట్ట పడటం లేదు. తమిళనాడు ‘‘ద్వి భాషా విధానాన్ని’’ మాత్రమే అవలంబిస్తుందని డీఎంకే ప్రభుత్వంలోని నాయకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా స్టాలిన్ ‘‘ఉర్దూ’’ హామీని గుర్తు చేస్తూ విమర్శించారు. 2015లో స్టాలిన్ ‘‘నమక్కు నామే’’ అనే ప్రచారంలో మాట్లాడుతూ.. డీఎంకే అధికారంలోకి వస్తే పాఠశాలల్లో ఉర్దూను తప్పనిసరి చేస్తానని, ముస్లిం సమాజానికి హామీ ఇచ్చిన విషయాన్ని అమిత్ మాల్వియా హైలెట్ చేశారు.

Read Also: Bangladesh: యూనస్, పాక్ జోక్యంపై బంగ్లా ఆర్మీ చీఫ్ అసహనం.. తిరుగుబాటు తప్పదా..?

‘‘ఉర్దూ అమలుకు చట్టం తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ వంటి భారతీయ భాషలను అణగదొక్కాలని డీఎంకే దృఢంగా నిశ్చయించుకుంటే, ఉర్దూను విధించడం ఎలా ఆమోదయోగ్యం అవుతుంది..? గొప్ప అవకాశాలు కోలుకునే తమిళ యువ విద్యార్థులు సమాధానికి అర్హులు’’ అని మాల్వియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

స్టాలిన్ మూడు భాషా విధానానికి తన తీవ్ర వ్యతిరేకతను పదే పదే ప్రస్తావిస్తు్న్నారు, అవసరమైతే తమిళనాడు “మరో భాషా యుద్ధానికి సిద్ధంగా ఉంది” అని ప్రకటించారు. డీఎంకే చాలా కాలంగా త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తోంది, తమిళనాడులో తమిళం, ఇంగ్లీషు బోధనా మాధ్యమంగా కొనసాగాలని పట్టుబడుతోంది. 196 నాటి ద్రవిడ ఉద్యమం, హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని డీఎంకే గుర్తు చేస్తో్ంది.

Exit mobile version