Site icon NTV Telugu

Congress vs BJP: ఇటలీ పౌరురాలికి ఓటు ఎలా వచ్చింది.. సోనియాగాంధీపై బీజేపీ ఎదురుదాడి

Sonia Gandhi

Sonia Gandhi

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ యుద్ధం ప్రకటించింది. అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం ఓట్లను తొలగిస్తుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఢిల్లీ వేదికగా పెద్ద పోరాటమే చేపట్టింది. పార్లమెంట్‌లోనూ.. బయట నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే అక్రమ ఓట్లనే తొలగిస్తున్నట్లు ఈసీ క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: BR Gavai: వీధి కుక్కల తీర్పుపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక ప్రకటన

తాజాగా కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడికి దిగింది. అనర్హులు, అక్రమ ఓటర్లను తొలగిస్తుంటే రాహుల్‌గాంధీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా తీవ్రంగా విమర్శించారు. సోనియాగాంధీ భారతీయ పౌరురాలు కాకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఓటు వేశారంటూ నిలదీశారు. ఇందుకు 1980లో ఓటరు జాబితాలో సోనియాగాంధీ పేరు ఉండడాన్ని ప్రశ్నించారు. అధికారికంగా సోనియాగాంధీ 1983, ఏప్రిల్ 30న భారతీయ పౌరురాలి అయితే.. అంతకంటే ముందుగా రెండు సార్లు ఓటర్ జాబితాలోకి పేరు ఎలా వచ్చిందని నిలదీశారు. ఇది అక్రమం కాదా? అని అడిగారు.

ఇది కూడా చదవండి: Maharashtra: 15న మాంసం అమ్మకాలపై నిషేధం.. తప్పుపట్టిన అజిత్ పవార్

సోనియాగాంధీ.. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్నాక కూడా దాదాపు 15 సంవత్సరాలు వరకు ఇటలీ పౌరురాలిగానే ఉన్నారని.. ఆమె ఎందుకు భారతీయ పౌరసత్వం తీసుకునేందుకు ఇష్టపడలేదని ప్రశ్నించారు. పైగా అధికారికంగా భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే ఆమె పేరు ఓటరు జాబితాలో ఎందుకు ఉందన్నారు. ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని ప్రశ్నించారు. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం.. భారత పౌరుడు కాని వ్యక్తి ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి అనర్హుడు అని పేర్కొన్నారు.

1980లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారిక నివాసం సఫ్దర్‌జంగ్ రోడ్డులో ఉంది. ఆ చిరునామాతోనే సోనియాగాంధీ పేరు ఓటర్ జాబితాలో ఉంది. ఆ జాబితాలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకా గాంధీ పేర్లు ఉన్నాయి. 1980లో న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను సవరించారని.. ఆ జాబితాలో సోనియా చేర్చారని మాల్వియా తెలిపారు. 1982లో నిరసనల తర్వాత జాబితా నుంచి పేరు తొలగించారని.. తిరిగి 1983లో మరోసారి ఆమె పేరు కనిపించిందని.. వాస్తవంగా సోనియాకు అధికారికంగా 1983, ఏప్రిల్ 30న భారతీయ పౌరసత్వం వచ్చిందని.. అలాంటిది అంతకముందే రెండు సార్లు ఓటర్ జాబితాలోకి పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని నిలదీశారు. ఇక రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న తర్వాత భారత పౌరసత్వాన్ని అంగీకరించడానికి ఆమెకు 15 సంవత్సరాలు సమయం ఎందుకు పట్టిందని అడగడం లేదన్నారు.

త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టి 65 లక్షల ఓట్లు తొలగించింది. దీనిపై విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అధికార పార్టీకి తొత్తుగా ఈసీ ఓట్లు తొలగించేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

 

Exit mobile version