Site icon NTV Telugu

Lok sabha: కాంగ్రెస్ వ్యాఖ్యలపై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నిరసన

Modi5

Modi5

పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ చోరీ’ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ‘‘మోడీకి సమాధి తవ్వాలంటూ’’ నినాదాలు చేశారు. ఇదే అంశంపై సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని మోడీని చంపాలనుకుంటున్నారా? అని కమలనాథులు ప్రశ్నించారు. సభలో గందరగోళం నెలకొనడంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

రాహుల్ గాంధీ..
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటు చోరీకి పాల్పడుతున్నారని దేశంలోని ప్రతి ఒక్కరికి తెలుసు అని రాహుల్ గాంధీ అన్నారు. ఓటరు జాబితాలోని అక్రమాలపై ఈసీని అడిగితే జవాబు లేదన్నారు. ఓటు చోరీ బీజేపీ డీఎన్ఏ‌లోనే ఉందని ఆరోపించారు. అధికారం కోల్పోగానే మోడీ నిజస్వరూపం బయటపడుతుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు.. పిఠాపురంలో ప్రారంభం..

డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు జరగనున్నాయి. సమావేశాల ప్రారంభమైన దగ్గర నుంచి ఓట్ చోరీ వ్యవహారంపై రగడ జరుగుతోంది. గత వర్షాకాల సమావేశాలు కూడా ఇలానే ముగిశాయి. ఈ సమావేశాలు కూడా అలానే ముగిసేలా ఉన్నాయి.

Exit mobile version