Site icon NTV Telugu

Delhi: మరోసారి ఢిల్లీని క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ

Bjp

Bjp

Delhi: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు, బీజేపీ అనుకున్న విధంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం 543 ఎంపీ సీట్లకు గానూ 2014, 2019లో బీజేపీ సొంతగానే మ్యాజిక్ ఫిగర్ మార్క్ 272ని దాటింది. అయితే, ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం, ఎన్డీయే కూటమి 290-300 మధ్యలో పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తర్ ప్రదేశ్ ఈ సారి ఆ పార్టీని దెబ్బతీసింది. ఈ రాష్ట్రంలో 80 సీట్లలో బీజేపీ 34 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 45 సీట్లను సాధించింది.

ఇదిలా ఉంటే ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు బీజేపీ కాపాడాయి. మరోవైపు బీజేపీకి కంచుకోటగా ఉన్న ఢిల్లీని మరోసారి క్లీన్ స్వీప్ చేసింది. గత రెండు పర్యాయాలుగా బీజేపీ ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలను గెలుచుకుంటూ వస్తోంది. ఈ సారి కూడా కాషాయ పార్టీ మరోసారి పునరావృతం చేసింది. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేసినప్పటికీ అక్కడ విజయం సాధించలేదు. ముఖ్యంగా లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ముందు వచ్చి ప్రచారం చేసినప్పటీ, తాను మళ్లీ జైలుకు వెళ్లొద్దంటే ఇండియా కూటమికి ఓటేయాలని అభ్యర్థించినప్పటికీ ఢిల్లీ ఓటర్లు పట్టించుకోలేదు. మరోసారి బీజేపీ వైపే మొగ్గు చూపారు.

Exit mobile version