బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడిగా ఎవరొస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనుంది. ఏప్రిల్ 22, 23 తేదీల్లో ప్రధాని మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అనంతరం కేబినెట్ విస్తరణ కూడా ఉండే ఛాన్సుందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Crime In Delhi: ఢిల్లీలో 24 గంటల్లోనే 3 హత్యలు.. శాంతిభద్రతలపై ఆప్ ఆగ్రహం..
ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష రేసులో కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువగా మనోహర్ లాల్ ఖట్టర్‌కు అవకాశం ఉన్నట్లు వార్తలు తెలుస్తోంది. ప్రధాని మోడీతో ఖట్టర్‌కు మంచి సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Russia-Ukraine: శాంతి ఒప్పందంపై అమెరికా సంచలన ప్రకటన
అనంతరం మోడీ కేబినెట్ విస్తరణ చేసే అవకాశం కూడా ఉంది. త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వొచ్చని సమాచారం. ఎన్‌సీపీ, శివసేనతో పాటు బీహార్‌లోని ఇతర మిత్రపక్షాలకు చోటు లభించే ఛాన్సుంది. కొత్త ముఖాలకు అవకాశం ఉంది. ఇక బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహా వంటి నేతకు కేబినెట్‌లో చోటు లభించే ఛాన్సుంది. వక్ఫ్ చట్టంపై ముస్లింలలో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో చాలా వ్యూహాత్మకంగా బీజేపీ హైకమాండ్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: PM Modi: ఎలాన్ మస్క్‌కి ప్రధాని మోడీ ఫోన్.. ముచ్చటెందంటే!
