దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు నడుస్తోంది. నామినేషన్ల సమర్పణకు గడువు దగ్గర పడింది. ఇంకోవైపు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తు్న్నారు. తాజాగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ అఫిడవిట్ వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.115.62 కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక విషయం..రూ. కోటి డిమాండ్..
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ నుంచి కేజ్రీవాల్, బీజేపీ నుంచి పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. పర్వేశ్ వర్మ, సందీప్ దీక్షిత్ ఇద్దరూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రుల కుమారులు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ శర్మ కుమారుడు పర్వేష్ వర్మ, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు.. ఓ మాజీ ముఖ్యమంత్రిపై పోటీ చేస్తున్నారు.
బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ ఆస్తులు ఐదేళ్లలో రూ.100 కోట్లకు పైగా పెరిగాయి. 2019 ఎన్నికల్లో రూ.15.52 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లు వచ్చేసరికి దాదాపు రూ.100కోట్లకు పైగా ఆస్తులు పెరిగినట్లుగా పేర్కొన్నారు. తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పర్వేశ్ వర్మనే పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో (2019-2025) చరాస్తులు రూ.3.2 కోట్ల నుంచి రూ.96.50 కోట్లకు పెరిగాయి.
ఇది కూడా చదవండి: SS Thaman: మహేష్ బాబు ఫాన్స్ కి థమన్ మార్క్ కిక్కు..
ఇదిలా ఉంటే మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాల్మీకి కాలనీలో బూట్లు పంపిణీ చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించారనే ఆరోపణలపై పర్వేష్ వర్మపై ఢిల్లీ పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై మందిర్ మార్గ్ ఎస్‌హెచ్‌ఓకు ఎన్నికల సంఘం లేఖ రాయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే తాను ఆలయం దగ్గర పారిశుధ్య కార్మికుల కాళ్లకు బూట్లు వేసి సన్మానించానని, పాదరక్షలు పంపిణీ చేయలేదని వర్మ పేర్కొన్నారు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈసారి ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..