Wayanad: ప్రియాంక విజయంపై హైకోర్టులో నవ్య సవాల్.. అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్
- ప్రియాంక విజయంపై హైకోర్టులో నవ్య హరిదాస్ సవాల్
- అక్రమాలు చోటుచేసుకున్నాయని పిటిషన్
- జనవరి 5 తర్వాత విచారణకు వచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ విజయాన్ని సమీప బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని.. ఆమె కుటుంబ ఆస్తులు కూడా తప్పుగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మోడల్ ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. ఓటర్లను కూడా తప్పుదారి పట్టించారని.. అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని నవ్య పిటిషన్లో ఆరోపించారు. అయితే డిసెంబర్ 23 నుంచి జనవరి 5 వరకు హైకోర్టుకు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. సెలవులు అనంతరమే నవ్య పిటిషన్ న్యాయస్థానం విచారించనుంది.
వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం సాధించడంతో రాజకీయ అరంగేట్రం ప్రారంభమైంది. ఆమెకు 6,22,338 ఓట్లు రాగా, మూడో స్థానంలో నిలిచిన హరిదాస్‌కు 1,09,939 ఓట్లు వచ్చాయి. దాదాపు 5లక్షలకు పైగా ఓట్ల తేడాతో నవ్య పరాజయం పాలయ్యారు. తాజాగా నవ్య హరిదాస్.. ప్రియాంక విజయాన్ని కోర్టులో సవాల్ చేశారు. అక్రమాలకు పాల్పడడం వల్లే ప్రియాంక విజయం సాధించారని ఆమె విమర్శించారు. ఓటర్లను తప్పుదోవ పట్టించడం వల్లే ప్రియాంక గెలిచిందని పేర్కొన్నారు.
Also Read
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు. అయితే వయనాడ్ వదులుకుని రాయ్‌బరేలీ స్థానం ఉంచుకున్నారు. దీంతో వయనాడ్‌లో బైపోల్ అనివార్యమైంది. ఇక్కడ ప్రియాంక నిలబడి భారీ విజయాన్ని అందుకున్నారు.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!