Site icon NTV Telugu

Lalan Paswan: హిందూ దేవతలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.

Bjp Mla

Bjp Mla

BJP MLA’s Controversial Comments on Hindu Gods: బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హిందూ దేవీదేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి. భాగల్‌పూర్ జిల్లాలోని పిర్‌పైంటి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ హిందువుల విశ్వాసాలను ప్రశ్నించారు. తన వైఖరిని నిరూపించుకోవడానికి కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రాజేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై భాగల్ పూర్ లోని షెర్మారీ బజార్ లో ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి, దిష్టి బొమ్మ దహనం చేశారు.

Read Also: Gold Price: దీపావళి ఆఫర్.. కుప్పకూలిన బంగారం ధర

దీపావళి రోజుల హిందువులు లక్ష్మీదేవిని పూజించడాన్ని ప్రశ్నించారు. లక్ష్మీదేవిని పూజించడం ద్వారానే డబ్బులు, సంపద లభిస్తే.. ముస్లింలలో కోటీశ్వరులు ఉండే వారు కానది.. ముస్లింలు లక్ష్మీదేవని పూజించరు.. వారు ధనవంతులు కాదా..? అని ప్రశ్నించారు. ముస్లింలు సరస్వతి దేవిని పూజించరు. వారిలో చదువుకున్న వారు లేరా.. వారు ఐఏఎస్, ఐపీఎస్ కాలేదా..? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆత్మ, పరమాత్ం అనే భావన కేవలం ప్రజల విశ్వాసమని లాలన్ పాశ్వాన్ అన్నారు.

మీరు నమ్మితే దేవుడు లేకపోతే కేవలం రాతి విగ్రహం అని.. మనం దేవుళ్లను నమ్మాలా..? వద్దా..? అనేది మన ఇష్టం అని వ్యాఖ్యానించారు. ప్రతీ దాన్ని సైంటిఫిక్ గా ఆలోచించాలని.. మీరు నమ్మడం మానేస్తే.. మీ మేధో సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. బజరంగబలి శక్తి కలిగిన దేవత అని, బలాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతాము. ముస్లింలు, క్రైస్తవులు హనుమాన్ ను పూజించారు. వారు శక్తివంతులు కారా..? మీరు నమ్మడం మానేసిన రోజే ఇవన్నీ ముగుస్తాయని లాలన్ పాశ్వన్ అన్నారు. గతంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తో జరిగిన సంభాషణలను లీక్ చేశారనే ఆరోపణలతో పాశ్వాన్ ముఖ్యాంశాల్లో నిలిచారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version