BJP MLA's Controversial Comments on Hindu Gods: బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హిందూ దేవీదేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి. భాగల్‌పూర్ జిల్లాలోని పిర్‌పైంటి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ హిందువుల విశ్వాసాలను ప్రశ్నించారు. తన వైఖరిని నిరూపించుకోవడానికి కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రాజేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై భాగల్ పూర్ లోని షెర్మారీ బజార్ లో ఆయనకు వ్యతిరేకంగా…