Site icon NTV Telugu

Vande Bharat: వందేభారత్‌లో గూండాయిజం.. సీటు మారలేదని ఎమ్మెల్యే అనుచరులు పిడిగుద్దులు

Vandebharat

Vandebharat

ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఓ ప్రజాప్రతినిధి గూండాయిజం ప్రదర్శించాడు. సాటి ప్రయాణికుడి పట్ల సహృదయంతో ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే రౌడీయిజం చూపించాడు. రైల్లో సీటు మారనందుకు విచక్షణ మరిచి ఎమ్మెల్యే అనుచరులు పిడుగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన ఢిల్లీ-భోపాల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు..

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన నియోజకవర్గానికి వెళ్తున్నాడు. కుటుంబ సభ్యులకు వేర్వేరు చోట్ల సీట్లు వచ్చాయి. అందరూ ఒకేచోట కూర్చుని ప్రయాణించేందుకు ఒకరిని సీటు మారమని ఎమ్మెల్యే అడిగాడు. అందుకు అతడు నిరాకరించాడు. అంతే ప్రజాప్రతినిధికి కోపం వచ్చినట్లుంది. అంతే ఎమ్మెల్యే తన అనుచరులను పురమాయించాడు. ఝాన్సీ స్టేషన్ రాగానే ఎమ్మెల్యే మనుషులు ట్రైన్ ఎక్కి ప్రయాణికుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: ENG vs IND: లీడ్స్‌ టెస్ట్‌లో సెంచరీల మోత.. ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ రికార్డ్

ఎమ్మెల్యే అనుచరుల దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తంతో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ వివాదంపై రైల్వే సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ విపుల్‌ కుమార్‌ స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ప్రయాణికుడు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయాడు. కానీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు.

 

Exit mobile version