Sophia Qureshi: కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు
- కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు
- బీజేపీ నేతపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్నల్ సోఫియా ఖురేషి.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రముఖంగా వినిపించిన పేరు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ ఉండేది. దీంతో ఆమె పేరు ప్రాచుర్యం పొందింది. సైనిక విన్యాసాల్లో భారత ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా గుర్తింపు పొందింది. 2016లో ‘ఎక్సర్సైజ్ పోర్స్ 18’లో భారత బృందానికి నాయకత్వం వహించింది. భారత్ చేపట్టిన అతిపెద్ద విదేశీ సైనిక డ్రిల్ ఇదే.
ఇది కూడా చదవండి: BrahMos: ఆపరేషన్ సిందూర్‌తో “బ్రహ్మోస్”కి సూపర్ క్రేజ్.. కొనుగోలుకు 17 దేశాలు క్యూ..
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ఇప్పుడెందుకు సోఫియా ఖురేషి అంశం ప్రస్తావనకు వచ్చిందంటే.. ఆమెపై మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా తీవ్రమైన మతతత్వ వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు హిందువులను పొట్టనపెట్టుకుంటే.. దానికి ప్రతీకారంగా ప్రధాని మోడీ.. ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని పాకిస్థాన్‌పైకి పంపించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీహార్ కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్టు చేసింది.
ఇది కూడా చదవండి: Trump: సౌదీ అరేబియాలో ట్రంప్ పర్యటన.. భార్య మెలానియా లేకుండానే టూర్
ఉగ్రవాదులు.. మన సోదరీమణులు, ఆడకూతుళ్ల సిందూరం తుడిచేసి పారిపోయారు. అందుకే వారి సొంత సోదరినే వాళ్లకు గట్టి సమాధానం చెప్పమని మోడీ పంపించారని విజయ్ షా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. సోఫియా ఖురేషిని టెర్రరిస్టుల సోదరిగా సంబోధించడం ఏంటి? అని హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోఫియా ఖురేషిని చూసి భారతీయులు గర్విస్తుంటే.. ఇలాంటి సమయంలో ఆమె గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీకి సన్నిహితుడిగా చెప్పుకునే విజయ్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
'कर्नल सोफिया कुरैशी आतंकवादियों की बहन हैं'
– ये घटिया बात मध्य प्रदेश में BJP सरकार के मंत्री विजय शाह ने कही है।
जिस भारत की बेटी कर्नल सोफिया कुरैशी पर सबको नाज है, उस बेटी को लेकर ये शर्मनाक बयान दिया गया है। उन्हें आतंकवादियों की बहन बताया गया है।
ये हमारी पराक्रमी सेना… pic.twitter.com/mQMXPyraWJ
— Bihar Congress (@INCBihar) May 13, 2025
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!