Site icon NTV Telugu

Sophia Qureshi: కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు

Sophiaqureshi

Sophiaqureshi

కల్నల్ సోఫియా ఖురేషి.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రముఖంగా వినిపించిన పేరు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ ఉండేది. దీంతో ఆమె పేరు ప్రాచుర్యం పొందింది. సైనిక విన్యాసాల్లో భారత ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా గుర్తింపు పొందింది. 2016లో ‘ఎక్సర్‌సైజ్ పోర్స్ 18’లో భారత బృందానికి నాయకత్వం వహించింది. భారత్ చేపట్టిన అతిపెద్ద విదేశీ సైనిక డ్రిల్ ఇదే.

ఇది కూడా చదవండి: BrahMos: ఆపరేషన్ సిందూర్‌తో “బ్రహ్మోస్‌”కి సూపర్ క్రేజ్.. కొనుగోలుకు 17 దేశాలు క్యూ..

ఇప్పుడెందుకు సోఫియా ఖురేషి అంశం ప్రస్తావనకు వచ్చిందంటే.. ఆమెపై మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా తీవ్రమైన మతతత్వ వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదులు హిందువులను పొట్టనపెట్టుకుంటే.. దానికి ప్రతీకారంగా ప్రధాని మోడీ.. ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని పాకిస్థాన్‌పైకి పంపించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీహార్ కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఇది కూడా చదవండి: Trump: సౌదీ అరేబియాలో ట్రంప్ పర్యటన.. భార్య మెలానియా లేకుండానే టూర్

ఉగ్రవాదులు.. మన సోదరీమణులు, ఆడకూతుళ్ల సిందూరం తుడిచేసి పారిపోయారు. అందుకే వారి సొంత సోదరినే వాళ్లకు గట్టి సమాధానం చెప్పమని మోడీ పంపించారని విజయ్ షా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. సోఫియా ఖురేషిని టెర్రరిస్టుల సోదరిగా సంబోధించడం ఏంటి? అని హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోఫియా ఖురేషిని చూసి భారతీయులు గర్విస్తుంటే.. ఇలాంటి సమయంలో ఆమె గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీకి సన్నిహితుడిగా చెప్పుకునే విజయ్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 

Exit mobile version