Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjp Master Plan Behind Eknath Shinde As Chief Minister

Devendra Fadnavis: ఫడ్నవీస్ సీఎం పదవి ఎందుకు తీసుకోలేదంటే?

Published Date :June 30, 2022 , 7:40 pm
By Mahesh Jakki
Devendra Fadnavis: ఫడ్నవీస్ సీఎం పదవి ఎందుకు తీసుకోలేదంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎట్టకేలకు మహారాష్ట్ర రాజకీయాలు కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా, అనూహ్యంగా మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలన్నీ ఆశ్చర్యంలో మునిగిపోయాయి. ఆయన ప్రకటించే ముందువరకు కూడా ఫడ్నవీస్ సీఎం, ఏక్‌నాథ్‌ డిప్యూటీ సీఎంగా అందరూ భావించారు. కానీ ఆయన ప్రకటనతో సీన్ మారిపోయింది. కానీ ఇలా ఎందుకు ప్రకటించారనే విషయంపై చాలా వరకు ఆలోచనలో పడ్డారు.

శివసేనలో గతంలో చీలికలు ఏర్పడ్డాయి. కానీ ఈ సారి మాత్రం అత్యధికంగా ఎమ్మెల్యే తిరుగుబాటు బాటపట్టారు. ఈ నేపథ్యంలో తెరవెనుక ఉన్న సూత్రధారి భాజపానే అని కాంగ్రస్ తో పాటు ఎన్సీపీ నేతలు ఆరోపించారు. శివసేనకు మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో మంచి పట్టుంది. రానున్న ఎన్నికల్లో ఓటర్లు సానుభూతితో శివసేన వైపు మొగ్గు చూపితే మొదటికే మోసం వస్తుంది. ఈ అంశాలను పూర్తిగా విశ్లేషించిన బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ పీఠానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో సర్కారు ఏర్పాటు కానుంది. దీంతో పాటు ప్రస్తుత అసెంబ్లీ కూడా రెండేళ్లలోనే ముగియనుంది ఈ నేపథ్యంలో పెద్ద కార్యక్రమాలు చేపట్టలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించిన బీజేపీ.. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోపాటు సేనను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న అపవాదు వచ్చే ప్రమాదముంది. దీంతో అధికారాన్ని శివసేన తిరుగుబాటు దారులకే అప్పగించింది. ఒక వేళ ప్రభుత్వ వైఫల్యాలుంటే ప్రభుత్వానికే వ్యతిరేకంగా మారుతుంది తప్ప భాజపాకు కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడంతో పాటు దూకుడు పెంచిన సంగతి తెలిసింది. కానీ మహారాష్ట్రలో మాత్రం శివసేన అంతర్గత విభేధాలతో కూలిపోయేట్లు బీజేపీ వ్యవహరించింది. ప్రభుత్వానికి దూరంగా ఉండటం ద్వారా తాము ఎలాంటి తెరచాటు యత్నాలు చేయలేదని నిరూపించేందుకు యత్నిస్తోంది.

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు బలహీనంగా మారుతున్నాయి. మరోవైపు ఇప్పుడు ఏర్పడిన ఏక్‌నాథ్‌ షిండే సర్కారు బీజేపీపై ఆధారపడాల్సిందే. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో దూకుడుగా వ్యవహరించడం కంటే ఓపికగా వ్యవహరించడమే మేలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ ను ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టాలని కేంద్ర నాయకత్వం చెప్పిందని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. అమిత్ షా సూచన మేరకు ఫడ్నవీస్ కూడా అందుకు అంగీకరించినట్లు తెలిసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Devendra Fadnavis
  • eknath shinde
  • Maharashtra
  • Maharashtra political crisis

తాజావార్తలు

  • Adivi Sesh: నా సినిమాలతో అందరూ బాగుపడ్డారు.. అడివి శేష్ ఎమోషనల్!

  • Healthy Summer Drinks : షుగర్, బీపీ ఉన్నవారికి సైతం బెస్ట్ సమ్మర్ డ్రింక్.. ఈ హెల్తీ డ్రింక్‌ను సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Nuzvid: రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల ఘరాన మోసం బట్టబయలు..!

  • Iran-Mandeb: ఇరాన్ మరో జలసంధిని మూసేబోతుందా? మండేబ్‌పై సర్వత్రా టెన్షన్

  • Adivi Sesh: నేను కాలితో తంతే అనుష్క మెడకి గాయమైంది!!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions