NTV Telugu Site icon

BJP: పార్టీ చీఫ్ ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా సంస్థాగత మార్పులకు సిద్ధమవుతున్న బీజేపీ..

New Project (9)

New Project (9)

BJP: వరసగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రధానిగా మరోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టుబోతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీలో మార్పులు చేయబోతోంది. ప్రస్తుతం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేబినెట్‌లో చేరడంతో కొత్త చీఫ్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. నడ్డా పదవికాలం జూన్ 30తో ముగియబోతోంది.

ఇదిలా ఉంటే, పార్టీ కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు నడ్డా పదవీకాలన్ని పొడగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోడీ కేబినెట్‌లో నడ్డా ఆరోగ్య, రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర నాయకులలో ఒకరిని లేదా జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిని అత్యున్నత పదవికి తీసుకోవచ్చననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో ఎదురుదెబ్బ తాకడంతో కేంద్రం, రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షులను ప్రభుత్వంలోకి తీసుకుని, వేరే వారిని అధ్యక్షులుగా నియమించే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Joe Biden: జునెటీన్త్ వేడుకల్లో ఆశ్చర్యపరిచిన బైడెన్ వ్యవహారశైలి.. వీడియో వైరల్

పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ కేంద్రమంత్రిగా మారడం, బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కూడా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. బీజేపీ ప్రకారం, ఒక వ్యక్తికి ఒకే పదవి. దీంతో వీరి స్థానాల్లో రాష్ట్రాధ్యక్షులుగా కొత్తవారిని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో పాటు బీజేపీ చీఫ్ సీపీ జోషీ బ్రహ్మణ వర్గానికి చెందిన వారే కావడంతో, సీపీ జోషిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ ఘోర పరాజయం తర్వాత ఆ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిని కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది.

Show comments